Arjun Suravaram
Andhra Pradesh: విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఈ సీట్ల దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదలైంది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..
Andhra Pradesh: విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఈ సీట్ల దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదలైంది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలానే ఇటీవలే ఏపీ ప్రభుత్వం కూడా 2024-25 సంవత్సరానికి పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మరి..విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?, ఎవరు అర్హులు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలానే ప్రైవేటు స్కూల్స్ లో 25శాతం ఇచ్చే రిజర్వేషన్ లు జగన్ సర్కార్ పక్క అమలు చేస్తోంది. ఈక్రమంలోనే ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు ఒకటో తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్సీ, స్టేట్ సిలబస్ అమలవుతున్న ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు తప్పనిసరిగా కేటాయించాలి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6 నుంచి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇదే సమంయలో ప్రైవేట్ పాఠశాలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చి 1 వరకు పొడిగించారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ అయినా cse.ap.gov.in లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులు దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల సంబంధించిన ఆధార్, ఓటర్, రేషన్, భూహక్కు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ కాపీ లో ఏదోఒక దానిని యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా రిజస్టర్ చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను మార్చి 20 నుంచి 22 వరకు అధికారులు పరిశీలిస్తారు. ఏప్రిల్ 1న లాటరీ విధానంలో అర్హులైన విద్యార్థుల తొలి జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు. అలానే ఏప్రిల్ 15న లాటరీ ద్వారా రెండో జాబితాను ప్రకటిస్తారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు. ఈ అవకాశాన్ని అర్హులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పేద విద్యార్థులు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం జగన్ సంకల్పించారు. అందుకే విద్యాకు అవసరమయ్యే అన్ని సదుపాయాలను కల్పించారు. అంతేకాక ప్రైవేటు పాఠశాలల్లో కూడా పేద విద్యార్థులకు 25 శాత సీట్లు పక్కాగా అందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రైవేటు స్కూల్స్ లో 25 శాతం రిజర్వేషన్ ను ఈ ఏడాది కూడా పొడగించారు.