ఏపీలో ఫేక్ లీడర్ అంటూ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం సమ్మర్ లో వచ్చిన వేడిని మించి తలపిస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతల నుంచి వచ్చే మాటలు.. ఏపీ రాజకీయాన్ని  హీటెక్కిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో రాజకీయం  అంటే అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య అన్నట్లు సాగింది. ఇటీవల పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తరువాత ఏపీలో సీన్ మారిపోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ జనసేన అన్నట్లుగా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల వాలంటీర్ వ్యవస్థ ఏపీ రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, ఇతర నేతలు ఫైర్ అయ్యారు. తాజాగా వాలంటీర్ వ్యవస్థ ఇష్యూపై  నటి పూనమ్ కౌర్ సంచలన ట్విట్ చేశారు.

ఇటీవలే ఓ బహిరంగ సభలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ విమర్శించిన విషయం తెలిసింది. రాష్ట్రంలో 17 వేల మందికి మహిళళు కనిపించకుండా పోయారని, వారు కనిపించకుండా పొవడానికి వాలంటీర్లే కారణమంటూ ఆరోపించారు. అలానే పవన్ కల్యాణ్  మాటలకు మద్దతుగా టీడీపీ కూడా విమర్శలు చేస్తుంది.  ఇటీవలే నిర్వహించిన పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. వాలంటీర్లపై ఆరోపణలు గుప్పించారు. డేటా చోరీకి పాల్పడుతోన్నారని, ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.

వాలంటీర్ వ్యవస్థపై  జనసేన, టీడీపీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. మంత్రులు ఆర్ కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు నేతలు పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తాజాగా ఈ ఇష్యూపై సినీ నటి పూనమ్ కౌర్  స్పందించారు. ఏపీలో నకిలీ నాయకులు తిరుగుతున్నారని జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు పరోక్షంగా చురకలు అంటించారు. వాలంటీర్ వ్యవస్థపై పూనమ్ కౌర్ స్పందిస్తూ సంచలన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా గతంలో మహిళ రెజర్ల చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. “ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకుల తయారయ్యారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీ మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే వారు మహిళా రెజర్ల కోసం ఒక్కరు కూడా స్పందించలేదని గుర్తు చేశారు. తమకు రాజకీయంగా లాభం చేరుకూతుందనప్పుడే కలుగుతుందని ఆ నకిలీ నాయకులు రోడ్ల మీదికి వస్తోన్నారంటూ పూనమ్ కౌర్ చెప్పారు. అవకాశవాదంతో ఆందోళన చేసే నకిలీ నాయకుల పట్ల జాగ్రత్త ఉండాలంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. పూనమ్ కౌర్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు!

Show comments