iDreamPost
android-app
ios-app

అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా సీఎం జగన్: ఆర్.నారాయణ మూర్తి

అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా సీఎం జగన్: ఆర్.నారాయణ మూర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం విధానంపై ప్రశంసలు వస్తున్నాయి. విపక్షాలు వ్యతిరేకించినప్పటికి.. సీఎం జగన్ తనదైన శైలీ విద్య సంస్కరణ విషయంలో ముందుకెళ్లారు. ప్రభుత్వ స్కూల్లలో  ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టడం ద్వారా ఎంతో మంది  పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన..విద్యావిధానాలపై ఇప్పటికే చాలా మంది మేధావులు, ప్రముఖులు అభినందించారు. తాజాగా సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ప్రశంసించారు. జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన యూనివర్సటీ  సినిమా ప్రమోషన్ శనివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో యూనివర్సిటీ చిత్ర ప్రమోషన్ జరిగింది. ఈ మూవీకి సంబంధించిన మూడు పాటలను విద్యార్థుల సమక్షంలో ఆయన విడుదల చేశారు. పేపర్ లీకేజీల కథాంశంగా ఈ చిత్రాన్ని  రూపొందించారు. తన 32వ సినిమా యూనివర్సిటీ అక్టోబరు 4న విడుదల  అవుతుందని ఆయన తెలిపారు. కాసేపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వంపై , సీఎం జగన్ పై ప్రశంస వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా జ్యోతిరావుపూలే,బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహానుభావుల ఆశయాలను నేరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని నారాయణమూర్తి తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మ అయితే. .ఇంగ్లీష్ భాష నడిపించే నాన్న. జీతం, జీవితం ఇంగ్లీష్ పై ఆధారపడి ఉంది. విద్యావిధానంలో ఏపీ ప్రభుత్వం భేష్ గా ఉంది. విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, పేద విద్యార్థుల తల్లిదండ్రుల వేదన, నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగం భారతం కావాలి. విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాలను ప్రధానాంశాలుగా యూనివర్సిటీ సినిమాని తెరకెక్కించాను. ఈ సినిమా ఆక్టోబర్ 4న విడుదల కానుంది” అని తెలిపారు.

ఇక తిరుమలో వన్యమృగాల తిరుగుతుండటంపై ఆయన స్పందించారు. “తిరుమల కాలినడక మార్గంలో క్రూర మృగాలు భక్తుల ప్రాణాలను తీయడం మనసును కలచివేసింది. నడకదారి భక్తులకు చేతికర్ర ఇవ్వాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయం. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం  చేయాల్సిన అవసరం లేదు. వీలైతే సలహాలు ఇవ్వాలి. అడవులు, పొలాలకు వెళ్లే సమయంలో మమల్ని కాపాడుకోవడానికి కర్రనే ఉపయోగించాము” అని ఆయన తెలిపారు.  మరి.. సీఎం జగన్ పై సినీ హీరో ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబు ఇచ్చే రాఖీతో బైపీసీ చదివి.. ఇంజనీర్ కావచ్చు: విజయసాయి రెడ్డి