iDreamPost
android-app
ios-app

జగనన్న కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తా: అలీ

  • Published Nov 07, 2023 | 9:41 PM Updated Updated Nov 07, 2023 | 9:41 PM

మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Nov 07, 2023 | 9:41 PMUpdated Nov 07, 2023 | 9:41 PM
జగనన్న కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తా: అలీ

వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వివిధ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సామాజిక బస్సు యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్ని అన్ని వర్గాల ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసిన మంచి గురించి తెలియ జేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే మరోసారి ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఏమైనా చేస్తానని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ అన్నారు.

మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే  బొల్లా బ్రహ్మనాయుడు, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజనీ పాల్గొన్నారు. అలానే ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహదారులు, సినీ నటుడు అలీ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో  సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు అలీ.

ఆయన మాట్లాడుతూ…” జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకులు అనేదానికి మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. నేను జగన్ గారితో, వారి తండ్రిగారితో ప్రయాణం చేశాను. హైదరాబాద్ లో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉండే వాళ్లం. ఒకసారి వైఎస్సార్ గారు.. అలీ బాగున్నావా? అని అడిగారు. నాకేమి అన్న.. చాలా బాగున్నాను అని  చెప్పాను. సినిమాలో బాగానే ఉన్నావు.. రాజకీయాల్లో కూడా ఓ అడుగు వేయని తెలిపారు. అయితే నేను ఇంకా చిన్నవాడిని అన్నా.. టైమ్ వచ్చినప్పుడు తప్పక రాజకీయాల్లోకి వస్తానని తెలిపాను. అప్పుడు చెప్పాను.. ఆ టైమ్ 2019లో వచ్చి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. వైఎస్ జగన్ గారు పిలిచి.. నాతో ఉండు అన్నారు.  అదే రోజు నేను జగన్ గారితో ఒక మాట చెప్పాను. జగనన్న నీకు కోసం ఏమైనా చేస్తాను. ఎంతదూరమైన వెళ్తాను అని చెప్పాను.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడుని మరోసారి యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి” అని అలీ పేర్కొన్నారు. ఇదే సభలో చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు,మంత్రులు వివరించారు. మరి.. సినీ నటుడు అలీ ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş