ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం అంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూనే సాగుతోంది. స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం అనేక పరిణామల మధ్య విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరు పర్చారు. అక్కడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేటితో ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు మరో కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆయన రిమాండ్ పొగడిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈనెల 7వ తేదీన చంద్రబాబును స్కీల్ డెవల్మప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి.. ఏసీబీ కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ సమయంలో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి దిగారు కానీ, వారి ప్రయత్నాలు మొత్తం విఫలం అవుతూ వస్తున్నాయి. వెళ్లిన మరుసటి రోజే చంద్రబాబు బయటకు వస్తారని అందరూ భావించారు. కానీ సీఐడీ అధికారులు పక్క ఆధారులు సమర్పించడం, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బలంగా వాదనలు వినిపించడంతో చంద్రబాబుకు బెయిల్ రాలేదు.
నేటితో కోర్టు చంద్రబాబు విధించిన రిమాండ్ గడువు ముగిసింది. దీంతో మరో మూడు రోజులు రిమాండ్ ను పొడగించాలని సీఐడీ కోర్టులో విన్నవించింది. అలానే చంద్రబాబు తరుపున న్యాయవాదులు పలు కీలక విషయాలను జడ్జీ ముందు ఉంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యామూర్తి.. చంద్రబాబు రిమాండ్ ను మరో రెండు రోజులు పొడగించింది. ఈనెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడించారు. వర్చువల్ ధానంలో బాబును జడ్జి ఎదుట సీఐడీ ప్రవేశ పెట్టింది. ఆన్ లైన్ లోనే ఈ కేసు విచారణను జడ్జీ చేపట్టారు. మరి..తాజాగా చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.