iDreamPost

నోరు అదుపులో పెట్టుకోండి.. TDP సభ్యులకు మంత్రి బుగ్గన వార్నింగ్!

నోరు అదుపులో పెట్టుకోండి.. TDP సభ్యులకు మంత్రి బుగ్గన వార్నింగ్!

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే టీడీపీ నేతల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడింది. స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అంతేకాక స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. తమ నిరసనను తెలియజేశారు. అంతేకాక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇరుపక్షాల మాటల యుద్ధంతో అసెంబ్లీలో ఉద్రికత్త నెలకొంది. రెండో రోజు కూడా అదే తీరు ఏపీ అసెంబ్లీలో కనిపించింది. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనలు చేశారు. అయితే వారి ప్రవర్తనపై విసుగు చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. టీడీపీ సభ్యులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

శుక్రవారం రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభం కాగానే టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అంతేకాక వారి స్థానాలను వదిలేసి..స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మరీ.. గందగోళం సృష్టించారు. చంద్రబాబు అరెస్టు అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా.. వాయిదా తీర్మానం కావాలని కోరుతూ టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. అలానే  సభలో సీఎంను ఉద్దేశిస్తూ టీడీపీ సభ్యులు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు.

బాలకృష్ణ అయితే ఏకంగా అసెంబ్లీలో విజిల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యలను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మనిషికి నోరు ఒక్కటే ఉంటుందని, మాటలు పొదుపుగా రావాలని అన్నారు. అంతేకాక నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, మా వైపు కూడా నోరు గట్టిగానే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని, కావాలనే సభకు అంతరాయం కలిస్తున్నారని ఆయన అన్నారు. అలానే ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలు ఉంటాయని, టీడీపీ సభ్యుల్లో కూడా సీనియర్లు ఉన్నారని, వారు వయసుకు తగ్గట్లు మాట్లాడాలని  బుగ్గన హితవు పలికారు.

టీడీపీ నేతలను నోరుపు అదుపులో పెట్టుకుని చెప్పండి అధ్యక్ష.. ఎట్లా అంటే అట్లా మాడితే ఇక్కడ వినుకుంటా, చూసుకుంటా ఇక్కడ ఎవరు లేరని, మాటలకు కూడా ఒక పరిధి ఉంటుందని ఆయన  అన్నారు. అన్యాయంగా నోరు ఉంది కదా.. అని మాట్లాడితే, సంబోధిస్తే.. మాకు వస్తాయి, వాళ్లు ఒకటి చెబితే.. ఇక్కడ పది చెప్పగలం, కాబట్టి ఇప్పటికైనా నోరుపు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలను బుగ్గన హెచ్చరించారు. మరి.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి