SNP
SNP
బీరు బాటిళ్లు, మద్యం సీసాలతో సాయిబాబాకు అభిషేకం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో చోటు చేసుకుంది. సాధారణంగా దేవుళ్లకు అభిషేకాలు, పూజలు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక పాత్రలను ఉపయోగిస్తారు. అంతే కానీ ఏవి పడితే అవి వాడరు. కానీ.. ఇక్కడ భక్తులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. తేనే, ఇతర అభిషేక ద్రవాలను బీరు బాటిళ్లు, విస్కీ సీసాల్లో నింపి వాటితోనే అభిషేకం చేసి వివాదాల పాలయ్యారు.
గ్రామంలో సాయిబాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించిన తర్వాత కొంతమంది భక్తులు బాబాకు పలు రకాల ద్రవాలతో అభిషేకం చేశారు. కానీ ఆ ద్రవాలు మద్యం బాటిళ్లలో ఉండటమే వివాదానికి కారణమైంది. కొన్ని ప్రత్యేక పాత్రల్లో ద్రవాలతో అభిషేకం చేస్తారు కానీ, మరీ ఇంత నిర్లక్ష్యగా వ్యవహరిస్తారా? అంటూ సోషల్ మీడియాలో వేదికగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా.. ఇలాంటి చర్యలు దేవుడిని అవమానించినట్లే అవుతుందని మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.