Krishna Kowshik
Jahnavi Kandula.. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది జాహ్నవి కందుల. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ చేరింది. ఎన్నో కలలు కనింది. కానీ ఆ కలలను చెరిపేశారు పోలీసులు. 2023 జనవరిలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ మరణానికి కారకులు
Jahnavi Kandula.. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది జాహ్నవి కందుల. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ చేరింది. ఎన్నో కలలు కనింది. కానీ ఆ కలలను చెరిపేశారు పోలీసులు. 2023 జనవరిలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ మరణానికి కారకులు
Krishna Kowshik
చదువు, ఉద్యోగాలంటూ విదేశాలకు పరుగులు పెడుతున్నారు భారతీయులు. వీరిలో తెలుగు రాష్రాలకు చెందిన వ్యక్తులు కూడా అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో అబ్రాడ్ వెళుతున్నారు. పిల్లల్ని వదలి ఉండలేకపోయినప్పటికీ.. తమ తలకు మించిన భారం అయినప్పటికీ.. వారి భవిష్యత్ నిమిత్తం అప్పొ సొప్పో చేసి ఫారిన్ కంట్రీలకు పంపిస్తున్నారు. కానీ అక్కడకు వెళ్లాక.. అనూహ్య తీరిలో మరణిస్తూ.. పేరెంట్స్ కలలపై నీళ్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్స్ పై దాడులు జరుగుతున్న సంగతి విదితమే. అయితే సామాన్యుల చేతిలో కాకుండా అక్కడి పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి బలైంది తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల. గత ఏడాది జనవరిలో సియోటెల్ లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని జాహ్నవి మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి.. మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. ఆమె సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరింది. అయితే గత ఏడాది జనవరి 23న మార్క్ క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా.. జాహ్నవిని పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ వాహనం ఢీకొట్టడంతో మరణించింది. ఈ మరణం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆమె మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆమె మృతిపై దర్యాప్తు జరుగుతుండగా.. పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడాడు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదు’ అని వెకిలిగా నవ్వాడు. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది.
దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కేంద్ర ప్రభుత్వం. పెద్ద యెత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే అప్పట్లోనే అతడ్ని సస్పెండ్ చేశారు. తాజాగా తుది చర్యలు తీసుకున్నారు. జాహ్నవి మృతి పట్ల హేళనగా మాట్లాడిన పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని, మనస్సులను గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సూ రహర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నామని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తమ డిపార్ట్ మెంట్ కు మాయని మచ్చలా మారాయని, పోలీసు వృత్తికే సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వాపోయారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. ఆయన్ను విధుల్లో కొనసాగించడం పోలీసు డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని, అందుకే ఉద్యోగంలో నుండి తొలగించినట్లు తెలిపారు.