ప్రపంచంలో అనేక జాతుల జంతువులు ఉంటాయి. వాటిలో చాలా అరుదుగా కొన్ని జంతువులు ఉంటాయి. అలాంటివిలో బావురు పిల్లి ఒకటి. దక్షిణ ఆగ్నేయా ఆసియా దేశాల్లో మాత్రమే ఈ అరుదైన పిల్లి కనిపిస్తుంది. ఈ బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2000లోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కేవలం 11 దేశాల్లో మాత్రమే ఈ బావురు పిల్లులు కనిపిస్తుంటాయి. అలాంటివి ఇటీవలే ఉమ్మడి కృష్ణ, గుంటూరు అభయారణ్యం ప్రాంతంలో ప్రత్యేక్షమయ్యాయి. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చేపలను వేటాడి జీవించే ఈ జాతి పిల్లులను ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. ఈ బావురు పిల్లి 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. ఈ పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. ఇక ఈ పిల్లుల ఆకారం మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులి కంటే చిన్నవి గాను ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేయడంతో ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాల్లో నిర్వహిస్తున్నారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరి.. ఈ అరుదైన జాతి బావుర పిల్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.