Arjun Suravaram
పిట్టకొంచెం కూతఘనం’అనే మాటను మనం చిన్నప్పుడు నుండి వింటూ వున్నాం.దాన్ని అప్పుడప్పుడు నిజం చేసే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ ఐదు నెలల పాప విషయంలో అదే జరిగింది.
పిట్టకొంచెం కూతఘనం’అనే మాటను మనం చిన్నప్పుడు నుండి వింటూ వున్నాం.దాన్ని అప్పుడప్పుడు నిజం చేసే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ ఐదు నెలల పాప విషయంలో అదే జరిగింది.
Arjun Suravaram
‘పిట్టకొంచెం కూత ఘనం’ అనే సామెతను మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. పిల్లలు వారి వయస్సుకు మించి ఏదైనా ఘనత సాధించినప్పుడు ఈ సామెత వాడుతుంటారు. అలాంటి ఘటనలు కూడా తరచూ జరుగుతూనే ఉంటాయి. అంతేకాక ఎంతో మంది పిల్లలు తమ అధ్బుతమైన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేస్తారు. ఇక ఇలాంటి సూపర్ టాలెంట్ కలిగిన పిల్లలు మన ఇంట్లో ఉంటే ఉండే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలు వయస్సుకు మించి ప్రతిభను సాధిస్తే.. ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతుంటారు. అలాంటి సంతోషంలోనే ఓ సాఫ్ట్ వేర్ దంపతులు ఉన్నారు. వారి ఐదు నెలల బిడ్డ టాలెంట్ కి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. మరి.. ఆ చిట్టితల్లి ప్రతిభ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామానికి చెందిన ఇడుపుపాలటి నితిన్, తనూజలు భార్యాభర్తలు. వీరిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ దంపతులు హైదరాబాద్ లో తమ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి జైత్రి అనే ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఈ బుజ్జితల్లి వయస్సు కేవలం ఐదు నెలలు మాత్రమే. అయితే ఆ పాప టాలెంట్ చూసి.. నితిన్ దంపతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన కొద్దిరోజులకే జైత్రికి ఉన్న జ్ఞాపక శక్తి, వస్తువులను గుర్తించడం, గ్రహించడం అనే టాలెంట్ ను తల్లిదండ్రులు గమనించారు.
ఇక ఆ చిన్నారికి మరికాస్తా ట్రైనింగ్ ఇస్తే.. అద్భుతం సాధిస్తుందని భావించారు. ఇక అప్పటి నుంచి జైత్రికి వివిధ రకాల మొక్కలు చూపిస్తూ వాటి వాడుక పేర్లను చెప్పడం మొదలు పెట్టారు. అంతేకాక వాటి శాస్త్రీయ నామాలను సైతం పాపకు చెప్పారు. అలా ఆ చిన్నారి కొన్ని రోజులకు వంద రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా వెంటనే ఫ్లాష్ కార్డు ఆల్బమ్ లో వాటిని సులభంగా గుర్తిస్తోంది. ఇలా కొన్ని రోజుల పాటు తమ బిడ్డకు మొక్కల గురించి చెప్పడం ప్రారంభించారు. ఇదే సమయంలో జైత్రికా టాలెంట్ ను తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ’ ఆ పాప ప్రతిభను పరీక్షించింది.
నోబెల్ వరల్డ్ రికార్డ్ వారు సైతం ఆ చిన్నారి అద్భుత టాలెంట్ ను చూసి ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయస్సులో జ్ఞాపక శక్తి ఈ స్థాయిలో ఉండటం పట్ల తోటి వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఇక నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్లు జైత్రికి ప్రశంసాపత్రం అందేజేశారు. దానితో పాటు స్వర్ణ పతకాన్ని కూడా అందజేసింది. ఆ చిన్నారిని బంధుమిత్రులతో పాటు స్థానికులు కూడా అభినందిస్తున్నారు. మరి.. ఈ చిన్నారి సూపర్ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.