iDreamPost
android-app
ios-app

అయ్యో పాపం.. కూతురి పెళ్లి కోసం దాచిన రూ. 2 లక్షలు ఎలుకల పాలు!

కూతురు పెళ్లి వైభవంగా చేయాలని ఆ తండ్రి కష్టపడి సంపాదించి దాచిన డబ్బు ఎలుకల పాలైంది. రూ. 2 లక్షలు విలువ చేసే కరెన్సీని ముక్కుల ముక్కలుగా కొరికేశాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

కూతురు పెళ్లి వైభవంగా చేయాలని ఆ తండ్రి కష్టపడి సంపాదించి దాచిన డబ్బు ఎలుకల పాలైంది. రూ. 2 లక్షలు విలువ చేసే కరెన్సీని ముక్కుల ముక్కలుగా కొరికేశాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

అయ్యో పాపం.. కూతురి పెళ్లి కోసం దాచిన రూ. 2 లక్షలు ఎలుకల పాలు!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు కూడా ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారాలు. మరీ ముఖ్యంగా సామాన్యుల విషయానికి వస్తే.. సొంతింటికోసం, కూతుర్ల పెళ్లిల్ల కోసం శక్తికి మించి శ్రమిస్తుంటారు. కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టుకుంటుంటారు. ఇలాగే ఓ తండ్రి తన కూతురు పెళ్లి కోసం డబ్బులను జమ చేశారు. ఆ డబ్బుతో కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపాలనుకున్నాడు. ఆ డబ్బును భద్రంగా ఓ ట్రంక్ పెట్టెలో దాచిపెట్టాడు. అలా దాచిపెట్టిన డబ్బు ఎలుకలపాలైంది. కొంత కాలం తరువాత ఆ పెట్టెను తెరిచి చూడగా నగదు అంతా ముక్కలు ముక్కలుగా కనిపించింది. అది చూసిన వారికి గుండె ఆగినంత పనైంది. కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నగదు చేతిలో ఉన్నట్లైతే దానిని బ్యాంకులో దాచుకుంటుంటారు. కానీ కొందరు అవగాహన లేక ఆ డబ్బును ఇళ్లలోనే ఉంచుకుని బ్యాగులల్ల లేదా బీరువాలు, ట్రంకు పెట్టెలల్ల దాచిపెడుతుంటారు. కానీ అది ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలుకలు లేదా చెదలు ఆ డబ్బును అంతా ముక్కలు ముక్కలుగా చేసే అవకాశం ఉంటుంది. దీనికి సబంధించిన ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాకు పుత్తూరు గ్రామానికి చెందిన గోపాల్ రావు అనే వ్యక్తి తన కూతురు వివాహం కోసం రూ. 2 లక్షలను జమ చేశారు. ఆ డబ్బును ట్రంక్ పెట్టెలో పెట్టగా ఆ నగదును అంతా ఎలుకలు ముక్కలుగా కొరికేశాయి.

అయితే గోపాల్ రావు అనే వ్యక్తి తన కూతురు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసం రూ. 2 లక్షలను సిద్ధం చేసి ఆ డబ్బును ట్రంక్ పెట్టెలో పెట్టి దాచాడు. ఈ క్రమంలో అతడు అనారోగ్యంతో కూతురు పెళ్లి కాకముందే మరణించాడు. అతడి మరణానంతరం కుటుంబ సభ్యులు ట్రంక్ పెట్టెను ఓపెన్ చేయగా అందులోని డబ్బు అంతా ముక్కులై కనిపించింది. ఎలుకలు డబ్బును కొరికేయడంతో కష్టపడి కూతురు పెళ్లి కోసం సంపాదించిన డబ్బు ఇలా పనికిరాకుండా పోవడంతో వారు బోరున విలపించారు. గోపాల్రావు కష్టార్జితం కాస్త ఎలుకలు కొరికేయడం చూసి అతని తల్లిదండ్రులు లక్ష్మణరావు, గుంపమ్మ, తమ్ముడు చిన్నారావు కన్నీరు మున్నీరయ్యారు. ఇది తెలిసిన వారు పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదంటూ కన్నీల్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.