iDreamPost
android-app
ios-app

పురాతన ఆలయం మరమ్మత్తు చేస్తుండగా.. మిలమిలా మెరుస్తూ!

  • Published Feb 06, 2024 | 12:38 PM Updated Updated Feb 06, 2024 | 12:38 PM

సాధారణంగా పురావస్తు శాఖ వారు పాత కాలం నాటి వస్తువుల మీద రీసర్చ్ చేస్తూ ఉంటారు. వాటికోసం తవ్వకాలు చేస్తూ ఉండడం సహజం కానీ, ఇక్కడ ఒక ఊరిలో ఉన్న గుడికి మరమ్మతులు చేస్తుండంగా .. కొన్ని ఊహించని దృశ్యాలు కనిపించాయి.

సాధారణంగా పురావస్తు శాఖ వారు పాత కాలం నాటి వస్తువుల మీద రీసర్చ్ చేస్తూ ఉంటారు. వాటికోసం తవ్వకాలు చేస్తూ ఉండడం సహజం కానీ, ఇక్కడ ఒక ఊరిలో ఉన్న గుడికి మరమ్మతులు చేస్తుండంగా .. కొన్ని ఊహించని దృశ్యాలు కనిపించాయి.

  • Published Feb 06, 2024 | 12:38 PMUpdated Feb 06, 2024 | 12:38 PM
పురాతన ఆలయం మరమ్మత్తు చేస్తుండగా.. మిలమిలా మెరుస్తూ!

ప్రతి ఊరిలోను ఆలయాలు, చిన్న చిన్న గుడులు ఉండడం సహజం. అయితే, వాటిలో కొత్తగా నిర్మించిన ఆలయాలు ఉంటాయి.. అలానే కొన్ని తరాల క్రితం నిర్మించిన ఆలయాలు కూడా ఉంటూ ఉంటాయి. క్రమక్రమంగా ఆ పురాతన కట్టడాలు పాడవుతూ ఉంటాయి. కాబట్టి అలా పాడైపోయిన ఆలయాలకు .. మరమ్మతులు చేసి.. కొత్తగా రూపుదిద్దుతూ ఉంటారు చాలా మంది. అచ్చం ఇలానే తాజాగా ఒక ఊరిలో ఎప్పుడో కట్టించిన శివాలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో చాలా చోట్ల పాడుపడి ఉంది. దీనితో ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి మరమ్మతులు చేయించడానికి సిద్ధ పడ్డారు. ఈ క్రమంలో ఆలయంలో పనులు జరిపేటపుడు .. అక్కడ పనివారికి ఆ ప్రాంగణంలో ధగ ధగ మెరుస్తూ కొన్ని అద్భుత దృశ్యాలు కనిపించాయి. దీనితో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఆశ్చర్యకర సంఘటన నెల్లూరు జిల్లాలోని గుడ్లూరులో జరిగింది. ఆ ఊరిలో పురాతన శివాలయం ఒకటి ఉంది. ఆ ఆలయం రూపు మార్చాలని.. మరమ్మతులు చేపట్టారు కమిటీ సభ్యులు. ఈ క్రమంలో సోమవారం రోజున ఆలయ మరమ్మతుల పనులు చేపట్టారు. ముందుగా పార్వతి దేవి, వినాయకస్వామి ధ్వజ స్తంభాలను తొలగించారు. అయితే, ఆ ద్వజస్థంభాలను తొలగించే సమయంలో .. అక్కడ కూలీలకు ఆ ప్రాంగణంలో ధగ ధగ మెరుస్తూ కొన్ని వస్తువులు కనిపించాయి. దీనితో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. అవి ఏంటా అని పరిశీలించగా .. వాటిని పురాతన నాణేలుగా గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఈ నాణేలు లభించాయి. అవి ధ్వజస్థంభం కింద 405 నాణేలు, వినాయక ప్రతిమ కింద 105 నాణేలు లభించాయి.

ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి.. క్షణాల్లో ఈ వార్త ఊరంతా తెలిసిపోయి .. వైరల్ గా మారింది. అయితే ధ్వజస్తంభం కింద లభించిన నాణేలు 1800-1850 మధ్య కాలం నాటివని గుర్తించారు. ఇక వినాయకుని ప్రతిమ కింద లభించిన నాణేలపై ఎటువంటి ముద్రలు లేవని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆ నాణేలను భద్రపరిచారు ఆలయ కమిటీ సభ్యులు. అప్పట్లో ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఈ నాణేలను .. పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు స్థానికులు. అయితే పునరుద్ధరణ సమయంలో ఇటువంటివి బయటపడడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇక లభించిన ఈ నాణేలను మళ్లీ ప్రతిష్ట సమయంలో వినియోగిస్తామని తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.