Dharani
ముగిసిపోయిందనుకున్న కరోనా కథ మళ్లీ మొదలైంది. దేశంలో కోవిడ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
ముగిసిపోయిందనుకున్న కరోనా కథ మళ్లీ మొదలైంది. దేశంలో కోవిడ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Dharani
ముగిసిపోయిందనుకున్న కరోనా మహామ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. కోవిడ్ కొత్త వేరియంట్ దేశంలో కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా మళ్ళీ మన దగ్గర కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి రావడంతో.. ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. మాస్క్, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని తెలుపుతున్నారు వైద్యులు. ఇలా ఉండగా తాజాగా తెలంగణాలో 14 నెలల చిన్నారికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం చిన్నారికి హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోవిడ్ కేసులు వెలుగు చూశాయంటే..
హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈక్రమంలో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
తెలంగాణలోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నేడు తెలంగాణలో 6 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో ఒక కేసు వెలుగు చూశాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 20 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక్క హైదరాబాద్ లోనే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయిని అధికారులు తెలిపారు.
నిన్నటి వరకూ కరోనా కేసులే లేని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తాజాగా 2 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. నగరంలోని 85 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఏలూరులో మరో కోవిడ్ కేసు నమోదయ్యింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్యులు.