Arjun Suravaram
Arjun Suravaram
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మోదీ.. తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని మోదీకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాక బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏపీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్.. 13వేల అడుగుల ఎత్తులో స్కై డైవ్ చేస్తూ వినూత్నంగా మోదీకి విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లికి చెందిన సుదీప్ అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్నారు. అక్కడ ఓ కంపెనీలు సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా విషెష్ తెలియజేశాడు. మోదీ ఫోటోతో ప్రత్యేకంగా ఓ పతాకాన్ని సుదీప్ రూపొందించారు. ఆ జెండాతో డల్లాస్ లో 1300 అడుగుల ఎత్తుల్లో స్కై డైవ్ చేశారు. అక్కడ మోదీ ఫోటో కూడిన జెండను ప్రదర్శించారు. హ్యాపి బర్త్ డే మోదీ జీ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక సుదీప్ చేసిన ఈ విన్యాసంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయనపై ప్రశంసలు కురిపిస్తోన్నారు. ఇక సుదీప్ విషయానికి వస్తే.. ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో పాటు స్కై డైవింగ్ లు చేస్తుంటారు. సుదీప్ స్కై డ్రైవ్ లో అపార అనుభవం కలిగి ఉన్నారు. ఈ స్కై డైవ్ లో ఆయన ఎన్నో రికార్డులు సృష్టించారు. అంతేకాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్కై డైవింగ్ పోటీల్లో పాల్గొన్ని అనేక పతకాలను గెలిచాడు. అంతేకాక స్కై డైవింగ్ లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆసియా ఖండం అవతలో స్కై డైవ్ చేసిన వ్యక్తిగా రికార్డులో ఎక్కారు.
ఇలాంటి సాహసాన్ని 700 సార్లు చేశాడు. ప్రతిష్టాత్మకమైన డి లైసెన్స్ గ్రహిత అయ్యాడు. దీంతో ఆయన ప్రపంచంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా స్కై డైవింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఆయన ఇంటర్నేషనల్ స్కై డైవింగ్ కమిటీ లో సభ్యుడిగా ఉంటూ భారత్ వాణి వినిపించారు. ప్రస్తుతం సుదీప్ స్కై డైవింగ్ చేస్తూ మోదీకి విషెష్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా వినూత్నంగా విషెష్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.