iDreamPost

షూటింగ్స్ కు బ్రేక్.. టాలీవుడ్ లో మోగిన సమ్మె సైరన్!

టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. దాంతో పలు సినిమాల షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. దాంతో పలు సినిమాల షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

షూటింగ్స్ కు బ్రేక్.. టాలీవుడ్ లో మోగిన సమ్మె సైరన్!

సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. షూటింగ్స్ నడిస్తేనే వారి జీవనం నడుస్తుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగినట్లు తెలుస్తోంది. దాంతో మూవీ షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని సదరు సంఘం అధ్యక్షుడు తెలిపాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది.. తెలుగు మూవీ అండ్ టీవీ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. బంద్ కు పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు హానీఫ్ తెలిపాడు. దీంతో పలు సినిమా షూటింగ్స్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా హానీఫ్ మాట్లాడుతూ..

“మా అసోసియేషన్ లో దాదాపు 900 వెహికిల్స్ ఉన్నాయి. 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్నోసార్లు నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించుకున్నాం. అయినా పట్టించుకోలేదు. మరోసారి నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. వాహనాల రెంట్ పెంచడంతో పాటుగా మా సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం” అని హానిఫ్ చెప్పుకొచ్చాడు. ఇక సంఘం చైర్మన్ విజయ్ కుమార్ సైతం తమ డిమాండ్స్ ను నెరవేర్చాలని నిర్మాతల మండలిని కోరాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి