iDreamPost

తెలంగాణలో రేపటి నుంచే స్కూల్స్ ప్రారంభం.. సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్..

తెలంగాణలో రేపటి నుంచే స్కూల్స్ ప్రారంభం.. సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్..

సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. కాలేజీలు, స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే సమయం ఇది. తెలంగాణలో జూన్ 13 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అని చెప్పారు కానీ తర్వాత మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ విద్య శాఖా మంద్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి రేపట్నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమవుతాయి అని తెలిపారు.

సబితా ఇంద్రరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రేపటి నుండి ( జూన్ 13) పాఠశాల ప్రారంభం యధావిధిగా కొనసాగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తం మారింది. అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేసాం. ఆన్ లైన్ పాఠాలు ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు అందేలా చేశాం. టెట్ ఎగ్జామ్ నిర్వహణ బాగా జరిగింది. రేపటి నుంచి బడులు ఓపెన్ చేస్తున్నాం. పిల్లలందరికీ కూడా స్కూల్స్ కి స్వాగతం పలుకుతున్నాం. అన్ని ఏర్పాట్లు చేయాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం. ప్రభుత్వ పాఠశాల్లో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టబోతున్నాం. యథావిధిగా బుక్స్, యూనిఫార్మ్స్ కూడా అందిస్తాం. ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచనలు చేశాం. ప్రభుత్వ స్కూల్స్ లో టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకోవాలని కోరుతున్నాం. మిషన్ భగీరథ అన్ని స్కూల్స్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రేపు స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న స్కూల్స్ లో పిల్లలకి స్వాగతం పలకాలని కోరుతున్నాం అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి