iDreamPost

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక!

  • Published Dec 01, 2023 | 10:20 AMUpdated Dec 01, 2023 | 10:20 AM

ప్రస్తుతం బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం మెల్లి మెల్లిగా తుఫాన్ గా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం మెల్లి మెల్లిగా తుఫాన్ గా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

  • Published Dec 01, 2023 | 10:20 AMUpdated Dec 01, 2023 | 10:20 AM
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక!

గత నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి. దీనికి కారణంగ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఆగ్నేయ బంగాళా ఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతలో ప్రస్తుతం కేంద్రీకృతమైన ఉన్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడే అవకాశ ఉందని అంటున్నారు. ఇది వాయుగుండంగా బలపడి.. వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ 2 వ తేదీ నాటికి తుఫాన్ గా మారనుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ సంవత్సరం మరో తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మిథిలీ తుఫాన్ బీభత్సం పూర్తిగా చల్లారక ముందే మిచాంగ్ అనే తుఫాన్ విరుచుకుపడబోతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 2 నుంచి మిచాంగ్ తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్ లో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో తీరం దాటుతాయని అంటారు. వాస్తవానికి తుఫాన్ ప్రభావం ఈ నెల 4 నుంచి ఉంటుందని భావించినా.. రెండు రోజుల ముందే ఆ ప్రభావం కనపడేలా ఉందని అంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్ ఏపీపై ఎక్కువశాతం ప్రభావం చూపిస్తుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగా, ఉత్తర కోస్తాలో స్వల్పంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

డిసెంబర్ 2 నుంచి 5 వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. తుఫాన్ కారణంగా సముద్రంలోకి వెలకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని, ఇప్పట్లో వేటకు వెళ్లే పనులు పెట్టుకోవద్దని ఐఎండీ హెచ్చరించింది. కర్నూల్, ప్రకాశం, అనంతపురం, తిరుపతి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షం కురేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉందని.. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, కోతకు సిద్దమైన వరి పంటను వెంటనే కోసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక లోతట్లు ప్రాంత ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి