iDreamPost

ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్.. వెల్లువెత్తిన అర్జీలు!

  • Published Dec 08, 2023 | 10:55 AMUpdated Dec 08, 2023 | 12:44 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మార్క్ చూపిస్తున్నారు. ముందుగా ఆరు గ్యారెంటీలపై సతంకం, గతంలో దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తామ హీమీ ఇచ్చిన మేరకు ఉద్యోగం పత్రాన్ని అందించడం.. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చడం లాంటివి చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మార్క్ చూపిస్తున్నారు. ముందుగా ఆరు గ్యారెంటీలపై సతంకం, గతంలో దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తామ హీమీ ఇచ్చిన మేరకు ఉద్యోగం పత్రాన్ని అందించడం.. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చడం లాంటివి చేశారు.

  • Published Dec 08, 2023 | 10:55 AMUpdated Dec 08, 2023 | 12:44 PM
ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్.. వెల్లువెత్తిన అర్జీలు!

నిన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ తమిళసై. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీల పై సంతకం చేశారు. నిరుద్యోగ దివ్యాంగురాలు అయిన రజినీకి ఉద్యోగం ఇస్తూ.. వేదికపై నియామక పత్రాన్ని కూడా అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చేయని పనులు తాము చేసి చూపిస్తామని.. ప్రతి పౌరుడికి న్యాయం కల్పిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు.. విద్యుత్‌ శాఖపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తుంది. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. వివరాల్లోకి వెళితే..

ఈ రోజు నుంచి ప్రగతి భవన్ కాస్త.. జ్యోతిరావు పులే ప్రజా భవన్ గా మారింది.. సామాన్య ప్రజానికం కోసం ప్రజా భవన్ గేట్లు తెరుచుకున్నాయి. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ పౌరుడు అక్కడ అడుగు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూనే.. ప్రగతి భవన్ చుట్టు ఉన్న కంచె, గొడ, బారీకేడ్లను, గేట్లను తొలటించారు. ఇక నుంచి ఎవరైనా సరే ప్రగతి భవన్ లోకి తమ కష్టాల గురించి చెప్పుకోవడానికి రావొచ్చు.. ఇందుకో పోలీస్ రూల్స్ కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేడు ప్రజా భవన్ వేదిక గా ధరఖాస్తులు స్వీకరిస్తారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై తగు రీతిలో పరిశీలించి పరిష్కరిస్తారు. ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పులే ప్రజా భవన్ (ప్రగతి భవన్) లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున అర్జీలతో తరలి వస్తున్నారు.

ఈ ప్రజా దర్భార్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారలు పాల్గొంటారు. ప్రజా దర్భార్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారి నుంచి వినతీ పత్రాలు స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగత భవన్ ఒకప్పుడు దొరట గడీ మాదిరిగా ఉండేదని.. ఇక నుంచి అది ప్రజా భవన్.. కష్టాలు ఉన్న ఎవరైనా రావొచ్చు.. తమ కష్టాలు చెప్పువొచ్చు. ఇందుకోసం ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.. అన్నట్టుగానే నేడు ఆయన ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే సచివాలయాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతుంది. స్పీకర్, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే స్పీకర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. ఈ ప్రజా దర్భార్ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి