iDreamPost

ఎన్నికల వేళ వింత.. అర్థనగ్నంగా వెళ్లి నామినేషన్ దాఖలు!

ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రతి సందర్భంలోనూ అనేక విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్లు, ప్రచారం వేళ కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి  వెరైటీగా వెళ్లి నానిమినేషన్ దాఖలు చేశారు.

ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రతి సందర్భంలోనూ అనేక విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్లు, ప్రచారం వేళ కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి  వెరైటీగా వెళ్లి నానిమినేషన్ దాఖలు చేశారు.

ఎన్నికల వేళ వింత.. అర్థనగ్నంగా వెళ్లి నామినేషన్ దాఖలు!

ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రతి సందర్భంలోనూ అనేక విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్లు, ప్రచారం వేళ కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. కొందరు నాణేలను తీసుకుని నామినేషన్ వేసేందుకు వెళ్తుంటారు. అంతేకాక మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ప్రజా సమస్యలపై పాలకులకు నిరసన వ్యక్తం చేసేందుకు పోటీ చేస్తుంటారు.  తాజాగా ఓ వ్యక్తి  అర్థనగ్నంగా వెళ్లి నానిమినేషన్ దాఖలు చేశాడు. మరి.. ఆ వ్యక్తి ఎవరు.. ఆ  వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పూస శ్రీనివాస్ సామాజిక సమస్యలపై స్పందించి వ్యక్తి. తరచూ ప్రభుత్వాల విధానాలను కూడా ప్రశ్నిస్తుంటాడు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసేందుకు శ్రీనివాస్ వెరైటీ పద్ధతిని ఎంచుకున్నాడు. గెలుపోటములు పక్కనబెడితే, పట్టువదలని విక్రమార్కడిలా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నామినేషన్ వేస్తుంటారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశాడు. తాజాగా భువనగిరి నియోజకవర్గంలో వరుసగా ఐదవ సారి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశాడు. ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు వినూత్నంగా వెళ్లి నామినేషన్ వేస్తుంటాడు.

ఈ క్రమంలోనే ఈ సారి కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు పూస శ్రీనివాస్ సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ రిటర్నింగ్ అధికారి ఆఫీస్ కి వెళ్లాడు. అక్కడికి వెళ్లి.. శివసేన పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశాడు. ప్రజా సమస్యలను పాలకులు పట్టించుకోవడంలేదని.. అర్ద నగ్న ప్రదర్శన ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. అధికారుల, పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశానని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తీర్చేందుకు అర్ధ నగ్న ప్రదర్శనగా వెళ్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి.. ఈ అర్ధ నగ్నంగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి