iDreamPost

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Author Soma Sekhar Published - 08:59 AM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 08:59 AM, Wed - 23 August 23
చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరికొన్ని గంటల్లో జాబిల్లిపై అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఇండియాతో పాటుగా ప్రపంచం మెుత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనుంది. జూలై 14న ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది ఇస్రో.. 45 రోజులు ప్రయాణించిన ఈ రాకెట్ ఆగస్టు 23 బుధవారం సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టబోతోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు భారతదేశంతో పాటుగా.. ప్రపంచం మెుత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కాగా.. చంద్రయాన్-3 ల్యాండింగ్ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాబిల్లిపై జరిగే అద్భుత దృశ్యాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లు స్కూల్స్, కాలేజీల్లో లైవ్ టెలికాస్ట్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.

ఈ మేరకు తెలంగాణ ఎడ్యూకేషనల్ డైరెక్టర్ డీఈవోలకు, ప్రిన్సిపల్స్ కు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీని వల్ల పాఠశాలల పనివేళల్లో మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయాన్ని విమరమించుకుంది. కానీ ఈ అపూర్వ ఘట్టాన్ని విద్యార్థులు ఇళ్లలోనే ఉండి వీక్షించేలా చొరవ తీసుకోవాని తెలంగాణ విద్యా శాఖ కోరింది. విక్రమ్ సాప్ట్ ల్యాండింగ్ ప్రక్రియను గురువారం రోజున అన్ని స్కూల్స్ లో యూట్యూబ్ లో విద్యార్థులకు చూపెట్టాలని, చంద్రయాన్-3పై వారితో చర్చించాలని తెలంగాణ సర్కార్ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. కాగా.. తెలంగాణతో పాటుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. యూపీలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ అద్భుత దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలిన సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

ఇదికూడా చదవండి: పసిడి ప్రియులకు అలర్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి