iDreamPost

ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. ఇకపై ఆ చార్జీలుండవ్

వేసవి సెలవులు వచ్చేశాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో నగరాలకు బాట పట్టిన చాలా మంది.. తమ పిల్లలకు సమ్మర్ హాలీడేస్ రావడంతో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మల ఇళ్లకు పయనం అవుతున్నారు. అలాగే ఎన్నికలు కావడంతో స్వగ్రామాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

వేసవి సెలవులు వచ్చేశాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో నగరాలకు బాట పట్టిన చాలా మంది.. తమ పిల్లలకు సమ్మర్ హాలీడేస్ రావడంతో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మల ఇళ్లకు పయనం అవుతున్నారు. అలాగే ఎన్నికలు కావడంతో స్వగ్రామాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. ఇకపై ఆ చార్జీలుండవ్

సమ్మర్ సెలవులు కావడంతో ఫ్యామిలీ వ్యాప్తంగా సమీపంలోని టూరిస్టు ప్రాంతాలకు, అలాగే పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. పిల్లలకు సమ్మర్ హాలీడేస్ రావడంతో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మల ఇళ్లకు పంపిస్తుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వచ్చిన వాళ్లు సైతం తిరిగి స్వస్థలాలకు వెళుతున్నారు.  దీంతో హైదరాబాద్ నుండి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు లభించకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాళ్ల దందా పెరిగింది. డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి.  ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఊరు వెళ్లాలనుకునే వాళ్లు..ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటే.. ఫీజు లేదని వెల్లడించింది.

ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు.. ఎనిమిది రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్ చార్జీల నుండి మినహాయింపు వర్తిస్తుందని శుభవార్త తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్‌ని సంప్రదించండి’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న ప్రయాణీకుల కోసం కూడా ఇలాంటి ప్రకటన చేసిన సంగతి విదితమే.

యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ప్రయాణీకుల కోసం బస్సులు పెంచడమే కాకుండా.. అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్స్ చేసుకుంటే.. 10 పర్సంట్ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ ఆఫర్ ఇచ్చింది. అలాగే ఏపీలోని శ్రీశైలం, బస్సు సర్వీసులు,ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలోని ఫ్రీ బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుండి చాలా మంది పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే నగరంలోని ప్రధాన బస్టాంబ్ ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఈ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి