iDreamPost
android-app
ios-app

హైదరాబాదీ అరుదైన ఫీట్‌.. కేవలం 2.88 సెకన్లలోనే ‘Z నుంచి A’ వరకు టైపింగ్..!

English Alphabet Typing: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గొప్ప విషయం సాధించి అందరిచే శభాష్ అనిపించుకోవాలని ఉంటుంది. ఎవరూ చేయలేని అరుదైన ఫీట్ చేసి ఘనత సాధిస్తుంటారు. అలాంటి అరుదైన ఫీట్ హైదరాబాదీ సాధించాడు.

English Alphabet Typing: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గొప్ప విషయం సాధించి అందరిచే శభాష్ అనిపించుకోవాలని ఉంటుంది. ఎవరూ చేయలేని అరుదైన ఫీట్ చేసి ఘనత సాధిస్తుంటారు. అలాంటి అరుదైన ఫీట్ హైదరాబాదీ సాధించాడు.

హైదరాబాదీ అరుదైన ఫీట్‌.. కేవలం 2.88 సెకన్లలోనే ‘Z నుంచి A’ వరకు టైపింగ్..!

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక సక్సెస్ అనేది ఉంటుంది. అందుకోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటూ పాపులర్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పని చేసి అందరిచే ఔరా అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆశగా ఉంటుంది. ఒక గొప్ప పని చేయాలంటే.. అందులో ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది.  అలా కృషీ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఎంతో మంది నిరూపించారు. హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడు ప్రపంచంలో ఎవరూ చేయలేని ఓ అరుదైన ఫీట్ చేసి విజయం సాధించాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు.. అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అంటే ప్రపంచంలో అన్ని రకాల రికార్డులను కవర్ చేసే వార్షిక రిఫరెన్స్ బుక్. ప్రపంచంలో ఎవరూ చేయలేని అరుదైన ఫీట్ సాధించిన వారికి గిన్నిస్ వారల్డ్ రికార్డులో చోటు కల్పిస్తారు. సాధారణంగా ఎవరైనా కంప్యూటర్ కీ బోర్డ్ పై A నుంచి Z వరకు టైప్ చేసేందుకు ఎంతో కొంత సమయం పడుతుంది. లెర్నింగ్ చేసేవారికి ఒక లెక్క.. సీనియర్స్ కి మరోలెక్క. అయితే  ఎంత సీనియార్టీ ఉన్నా  Z నుంచి A టైప్ చేయాంటే చాలా టైమ్ పడుతుంది. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంతో మంది ప్రాక్టీస్ చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి కేవలం 3 సెకన్లలో లోపే కంప్యూటర్ కీ బోర్డుపై చేతి వేళ్లతో అద్భుతం చేశాడు.

HYD guinnis record

కంప్యూటర్ కీ బోర్డు పై కేవలం 2.69 సెకన్ల లోపే Z నుంచి A టైప్ చేసి అందరినీ అబ్బురపరిచాడు. అంతే కాదు ఈ అరుదైన ఘనతతో ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు.హైదరాబాద్ కి చెందిన ఆ యువకుడి పేరు ఎస్‌కే అష్రాఫ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌స్ట్రా‌గ్రామ్ పేజీలో అష్రాఫ్ టైపింగ్ చేసిన వీడియో షేర్ చేసింది. క్షణాల వ్యవధిలో ఇంగ్లీష్ లో అది కూడా Z నుంచి A టైప్ చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. అష్రాఫ్ సాధించిన ఈ ఘనతకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Guinness World Records (@guinnessworldrecords)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి