iDreamPost

పసిడి ప్రియులకు అలర్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Published Aug 23, 2023 | 8:37 AMUpdated Aug 23, 2023 | 8:37 AM
  • Published Aug 23, 2023 | 8:37 AMUpdated Aug 23, 2023 | 8:37 AM
పసిడి ప్రియులకు అలర్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల గురించి బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు ముందు హెచ్చరించినట్లే జరిగింది. శ్రావణమాసం మాసం, పెళ్లిళ్ల సీజన్ మొదలైతే గోల్డ్‌ రేటు పెరుగుతుంది.. కొనాలనుకునేవారు.. ఇప్పుడే త్వరపడండి అని హెచ్చరించారు. వారు చెప్పినట్లే.. జరుగుతోంది. ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి తగ్గడం లేదంటే స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కాగా.. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా లక్షల్లో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. దాంతో ధరలు పెరుగుతున్నాయి.

నేడు ఒక్కరోజే వెండి ధర ఏకంగా రూ.1500 పెరిగింది. నిన్న, ఈరోజు.. రెండు రోజుల్లో బంగారం ధర 10 గ్రాముల మీద రూ.110 పైన పెరిగింది. రానున్న రోజుల్లో గోల్డ్‌ రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. నేడు మన దగ్గర గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎంత ఉన్నాయి అంటే..

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరగ్గా నేడు మరో రూ.60 పెరిగింది. దాంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 54,200 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా ఈ రెండు రోజుల్లో రూ.110 పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రామలు రేటు రూ. 59,130 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో మాత్రం నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేటురూ. 54,300 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ గోల్డ్ రేటు కూడా రూ. 59,220 వద్ద ఉంది.

ఒక్కరోజే రూ.1500 పెరిగిన వెండి ధర..

నేడు వెండి ధర మరోసారి షాక్ ఇచ్చింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర మన హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా రూ. 1500 పెరిగింది. ప్రస్తుతం భాగ్యనరంలో కిలో వెండి రేటు రూ. 78 వేలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర కిలో మీద రూ.1300 పెరిగింది. క్రితం సెషన్‌లో ఇది రూ.200 పెరిగింది. మొత్తంగా ఢిల్లీలోనూ రెండు రోజుల్లో కిలో వెండి రేటు రూ. 1500 పెరిగి ప్రస్తుతం రూ. 74,800 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి