iDreamPost

Asian Games: ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు! అయినా ఇండియాదే గోల్డ్‌ మెడల్‌

Asian Games: ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు! అయినా ఇండియాదే గోల్డ్‌ మెడల్‌

ప్రతిష్టాత్మకమైన ఏషియన్ గేమ్స్ లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటికే వివిధ క్రీడల్లో 101 గోల్డ్ మెడల్స్ ను తన ఖాతాలో వేసుకున్న భారత్ తాజాగా క్రికెట్ విభాగంలో మరో గోల్డ్ మెడల్ సాధించి 102వ స్వర్ణాన్ని సాధించింది. ఏషియన్ క్రీడల్లో భాగంగా ఇండియా, ఆఫ్గనిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, ఆఫ్గనిస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఆట కొనసాగుతున్న క్రమంలో మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. అయినప్పటికీ భారత్ నే విజేతగా ప్రకటించారు. దీనికి గల కారణం ఏంటంటే?

ఏషియన్ క్రీడల్లో భారత పురుషుల జట్టు గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో భారత్ కు గోల్డ్ మెడల్ వరించింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ పున:ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో భారత్ కు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో ఆఫ్గనిస్థాన్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఏషియన్ గేమ్స్ లో క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆటగాళ్లు భారతీయ జెండాను పట్టుకుని స్టేడియంలో విజయ గర్వంతో సంబరాలు జరుపుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి