Nidhan
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గొప్ప మనసును చాటుకున్నాడు. అతడు చేసిన పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గొప్ప మనసును చాటుకున్నాడు. అతడు చేసిన పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
Nidhan
టీమిండియా ఇప్పుడు మంచి దూకుడు మీద ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో ఎదురొచ్చిన జట్లను తొక్కుకుంటూ పోతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి ఫుల్ స్వింగ్‌లో ఉంది. హ్యాట్రిక్ విక్టరీస్‌తో సూపర్-8 దశకు చేరుకున్న రోహిత్ సేన.. ఇవాళ కెనడాతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూనను చిత్తు చేసి ఉన్న ఒకట్రెండు బలహీనతల్ని కూడా అధిగమించాలని చూస్తోంది. భారీ విజయం సాధించి సూపర్-8 ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటోంది. ఇక మీదట అన్నీ బిగ్ మ్యాచెస్ కాబట్టి ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని భావిస్తోంది. ఇప్పటివరకు మెగా టోర్నీలో భారత జట్టు జర్నీని చూసుకుంటే బ్యాటింగ్ విభాగంలో వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ రోల్‌ను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 96 పరుగులు చేశాడు పంత్.
ఐర్లాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 36 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు పంత్. ఆ తర్వాత దాయాది పాకిస్థాన్ మీద 31 బంతుల్లో 42 పరుగుల విన్నింగ్ నాక్ ఆడాడు. యూఎస్ఏపై 18 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. క్రీజులో ఉన్నంత సేపు క్విక్‌గా స్ట్రైక్ రొటేషన్ చేయడమే గాక వీలు కుదిరినప్పుడల్లా భారీ సిక్సులు, బౌండరీలు బాదుతున్నాడు. రివర్స్ స్కూప్ లాంటి విచిత్రమైన షాట్లతో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. సిక్సులు గగనంగా మారిన అమెరికా పిచ్‌లపై పంత్ ధైర్యంగా భారీ షాట్లు కొడుతున్నాడు. విరాట్ కోహ్లీ రెగ్యులర్ ప్లేస్ అయిన మూడో నంబర్లో బరిలోకి దిగుతూ అపోజిషన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు పంత్. అలాంటోడు మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. రిషబ్ చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు.
పంత్ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేశాడు. తన పేరు మీద నడుస్తున్న ఈ ఛానల్లో పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. టీమిండియా ట్రైనింగ్ సెషన్స్‌తో పాటు తన జీవితంలోని పలు ఆసక్తికర ఘటనలు, విషయాలను ఇందులో షేర్ చేసుకుంటున్నాడు. అభిమానుల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు చెబుతూ ప్రత్యేక వీడియోలు చేస్తున్నాడు. వీటికి తెగ వ్యూస్ వస్తున్నాయి. 100కే సబ్స్క్రైబర్స్ దాటడంతో ఈ ఛానెల్‌కు సిల్వర్ బటన్‌ను ఇచ్చింది యూట్యూబ్. ఈ సందర్భంగా పంత్ కీలక ప్రకటన చేశాడు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. యూట్యూబ్ ఆదాయానికి తన పర్సనల్ కాంట్రిబ్యూషన్‌ను కూడా కలిపి మంచి పనుల కోసం వాడనున్నట్లు అతడే స్వయంగా వెల్లడించాడు. ఈ ప్లాట్‌ఫామ్‌ను మార్పు తీసుకొచ్చేందుకు వాడదామని పంత్ ట్వీట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. పంత్ గొప్ప మనసుకు ఇది నిదర్శనమని చెబుతున్నారు. మరి.. యూట్యూబ్ ఆదాయాన్ని మంచి పనుల కోసం వాడాలని పంత్ డిసైడ్ అవ్వడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rishabh Pant will donate all the earnings from YouTube for a good cause. 👌
– A lovely gesture by Pant. pic.twitter.com/08Z9f92yUB
— Johns. (@CricCrazyJohns) June 15, 2024