Nidhan
టీమిండియా ప్రత్యర్థికి సాయం చేయనున్నాడు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్. హెల్ప్ చేయడంలో తప్పు లేదు కానీ కాస్త తేడా వచ్చినా అంతే సంగతులు అని అందరూ అతడ్ని హెచ్చరిస్తున్నారు.
టీమిండియా ప్రత్యర్థికి సాయం చేయనున్నాడు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్. హెల్ప్ చేయడంలో తప్పు లేదు కానీ కాస్త తేడా వచ్చినా అంతే సంగతులు అని అందరూ అతడ్ని హెచ్చరిస్తున్నారు.
Nidhan
క్రికెట్లో కొందరు ఆటగాళ్లపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మంచి స్కిల్స్, టాలెంట్ ఉన్న వాళ్లు కెరీర్లో అత్యున్నత దశకు చేరుకోవడం పక్కా అని అందరూ అనుకుంటారు. కానీ కొందరి విషయంలో ఇది జరగదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు టాలెంట్, పెర్ఫార్మ్ చేసే సత్తా ఉన్నా ఎందుకో వారికి ఏదీ కలసిరాదు. దానికి స్పెషల్ రీజన్ అంటూ ఇదని చెప్పలేం. టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఈ కోవలోకే వస్తాడు. భారత్ తరఫున టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహరించిన కార్తీక్.. కెరీర్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. తమిళనాడు సచిన్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్.. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగిల్ హ్యాండ్‌తో భారత్‌కు పలు మ్యాచుల్లో విజయాలు అందించాడు. కానీ కెరీర్‌ను సుదీర్ఘంగా మలచుకోలేకపోయాడు. అలాంటి కార్తీక్ ఇప్పుడు టీమిండియా ప్రత్యర్థికి సాయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
భారత పర్యటన కోసం వస్తున్న ఇంగ్లండ్-ఏ (ఇంగ్లండ్ లయన్స్) టీమ్‌లో దినేష్ కార్తీక్ చేరనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రిపరేషన్స్‌లో సాయం చేయనున్నాడతను. 9 రోజుల పాటు ఆ జట్టుతోనే ఉండి భారత కండీషన్స్‌కు ఎలా అలవాటు పడాలి? ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలి? లాంటి విషయాల మీద వారికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. భారత్-ఏతో టూర్ మ్యాచ్, మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది ఇంగ్లండ్ లయన్స్. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచులు అహ్మదాబాద్‌లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 18 వరకు ఇంగ్లండ్ టీమ్‌తో జర్నీ చేయనున్నాడు కార్తీక్. ఆ తర్వాత ఆ జట్టు రెగ్యులర్ కోచ్ ఇయాన్ బెల్ తిరిగి టీమ్‌లోకి వస్తాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా తన వర్క్ పూర్తయ్యాక జనవరి 18న జట్టులో చేరతాడు బెల్.
ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కోచింగ్ బృందంలో దినేష్ కార్తీక్ చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతడ్ని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కార్తీక్‌ను విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి జట్లకు కోచింగ్ ఇవ్వడంలో తప్పులేదని.. మన జట్లు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి క్రికెటర్లు, కోచ్‌ల సాయం తీసుకుంటాయని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కార్తీక్ సలహాల వల్ల భారత-ఏ జట్టు ఓడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. తేడా కొడితే కార్తీక్ విమర్శలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ సిరీస్‌లో ఆడనున్న ఇండియా-ఏ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎస్ భరత్, నవ్‌దీప్ సైనీ లాంటి టీమిండియాకు ఆడిన ప్లేయర్లు ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుండటం విశేషం. మరి.. ఇంగ్లండ్-ఏకు దినేష్ కార్తీక్ సాయం చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆఫ్ఘానిస్థాన్‌తో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
Dinesh Karthik will join the England coaching team as batting consultant for 9 days against India A series (10-18th January).#Cricket #India #Karthik #INDAvENGA pic.twitter.com/3SbTcfMIub
— Sportskeeda (@Sportskeeda) January 10, 2024