iDreamPost

Team India: దాదా, యువీ, పఠాన్​ విధ్వంసానికి 16 ఏళ్లు.. ఈ రోజును పాక్ జన్మలో మర్చిపోలేదు!

  • Author singhj Updated - 10:16 PM, Sat - 9 December 23

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​పై సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెలరేగి ఆడిన ఆ మ్యాచ్​ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా డబుల్ సెంచరీతో దాదా సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​పై సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెలరేగి ఆడిన ఆ మ్యాచ్​ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా డబుల్ సెంచరీతో దాదా సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • Author singhj Updated - 10:16 PM, Sat - 9 December 23
Team India: దాదా, యువీ, పఠాన్​ విధ్వంసానికి 16 ఏళ్లు.. ఈ రోజును పాక్ జన్మలో మర్చిపోలేదు!

క్రికెట్ చరిత్రలో భీకర పోరాటల గురించి మాట్లాడితే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఒకటే. అదే టీమిండియా-పాకిస్థాన్​ ఫైట్. ఈ రెండు దాయాది జట్లు క్రికెట్ గ్రౌండ్​లోకి అడుగు పెట్టాయంటే చాలు.. ఆ మ్యాచ్​ వేరే లెవల్లో ఉంటుంది. రెండు కొదమసింహాలు నువ్వానేనా అంటూ తలపడినట్లు భారత్-పాక్ విజయం కోసం ఆఖరి వరకు పోరాడతాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఎన్నో ఉత్కంఠ రేపిన మ్యాచ్​లు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ జరిగాయి. అందుకే ఇప్పటికి కూడా దాయాదుల మధ్య సమరం అంటే చాలు అందరూ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అయితే ఇప్పుడు భారత టీమ్ బాగా స్ట్రాంగ్​గా ఉంది. అటు పాకిస్థాన్ మాత్రం మునుపటి అంత బలంగా లేదు. ఈ మధ్య కాలంలో ఆ జట్టు ప్రదర్శన నాసిరకంగా తయారైంది. వరల్డ్ కప్​లోనైతే నాకౌట్​కు కూడా క్వాలిఫై కాకుండానే మెగా టోర్నీలో నుంచి బయటకు వచ్చేసింది పాక్.

భారత్-పాకిస్థాన్​ మధ్య ఒకప్పుడు మ్యాచ్​లు చాలా ఆసక్తికరంగా సాగేవి. ఇరు టీమ్స్​లోనూ సీనియర్ ప్లేయర్లు ఉండటం, సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండే యంగ్​స్టర్స్ ఉండటంతో మ్యాచులు ఒక రేంజ్​లో టెన్షన్‌ రేపేవి. అప్పట్లో ఏ ప్లేయర్ బాగా ఆడితే అతడు ఓవర్​నైట్ స్టార్ అయిపోయేవాడు. సరిగ్గా ఆడకపోతే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనేవాళ్లు. అలాంటి భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైట్స్​లో ఒకటి మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా భారత ఫ్యాన్స్​కు ఇది సమ్​థింగ్ స్పెష​ల్ అనే చెప్పాలి. 2007లో ఇరు దాయాదుల మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్​లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్​తో పాటు ఇర్ఫాన్​ పఠాన్​లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఆ మ్యాచ్​లో ఒకే ఇన్నింగ్స్​లో యువరాజ్, పఠాన్ సెంచరీలతో వీరవిహారం చేయగా.. దాదా డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. వీళ్ల బాదుడుకు పాక్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోక చూస్తూ ఉండిపోయారు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడా లేకుండా బౌలింగ్​కు వచ్చిన ప్రతి ఒక్కర్నీ పిచ్చ కొట్టుడు కొట్టారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్​లో ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారత్ 626కు ఆలౌట్ అయింది. పాక్ తమ తొలి ఇన్నింగ్స్​లో 537 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్​లో 284 రన్స్ చేసింది టీమిండియా. పాక్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్​లో 7 వికెట్లకు 162 రన్స్ మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్​లో దాదా (239), యువీ (169), ఇర్ఫాన్ (102) బ్యాటింగ్ చేసిన తీరును ఎవరూ మర్చిపోలేరు. వీళ్ల దెబ్బకు పాక్ స్టార్ బౌలర్ మహ్మద్ సమి 149 రన్స్ ఇచ్చుకున్నాడు. స్పిన్నర్ డానిష్ కనేరియా అయితే ఏకంగా 168 పరుగులు ఇచ్చుకోగా.. యాసిర్ అరాఫత్ బౌలింగ్​లో 161 రన్స్ పిండుకున్నారీ ముగ్గురు భారత స్టార్లు. బౌండరీల వర్షం కురిపిస్తూ పాక్ బౌలర్లను దాదా అండ్ కో ఊచకోత కోసిన ఘటనను ఆ టీమ్ జన్మలో మర్చిపోలేదు. మరి.. ఈ ఇన్నింగ్స్​కు సంబంధించి మీకు గుర్తున్న విషయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: India vs South Africa: షమి, హార్దిక్ ఇంజ్యురీపై అప్​డేట్ ఇచ్చిన జై షా.. ఆయన ఏమన్నారంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి