iDreamPost

India vs South Africa: షమి, హార్దిక్ ఇంజ్యురీపై అప్​డేట్ ఇచ్చిన జై షా.. ఆయన ఏమన్నారంటే..?

  • Author singhj Published - 09:15 PM, Sat - 9 December 23

గాయాలతో ఇబ్బంది పడుతున్నారు టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా. వీళ్లు ఎప్పటి వరకు కోలుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు.

గాయాలతో ఇబ్బంది పడుతున్నారు టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా. వీళ్లు ఎప్పటి వరకు కోలుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు.

  • Author singhj Published - 09:15 PM, Sat - 9 December 23
India vs South Africa: షమి, హార్దిక్ ఇంజ్యురీపై అప్​డేట్ ఇచ్చిన జై షా.. ఆయన ఏమన్నారంటే..?

టీమిండియా మరో ఆసక్తికర సిరీస్ ఆడేందుకు సిద్ధమైపోయింది. నెల రోజుల పాటు జరిగే సఫారీ టూర్​కు రెడీ అయిపోయింది. సౌతాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది భారత్. డిసెంబర్ 10వ తేదీన డర్బన్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్​తో సిరీస్ మొదలుకానుంది. ఆస్ట్రేలియాతో సిరీస్​కు కెప్టెన్​గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ ఈసారి కూడా భారత్​ను ముందుండి నడిపించనున్నాడు. వన్డే ఫార్మాట్​కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించనుండగా.. టెస్టుల్లో రోహిత్ శర్మ సారథిగా ఉంటాడు. అటు సౌతాఫ్రికా కూడా కెప్టెన్లను మార్చింది. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా కేవలం టెస్టుల్లోనే టీమ్​ను ముందుండి నడపనున్నాడు. వన్డేలు, టీ20ల్లో స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్​రమ్ సారథ్యం వహించనున్నాడు.

సౌతాఫ్రికా గడ్డ మీద గెలవడం అంత ఈజీ కాదు. సొంత గడ్డపై అలవాటైన కండీషన్స్​లో మరింత రెచ్చిపోయి అటాకింగ్ గేమ్ ఆడుతుంది ప్రొటీస్. గత రికార్డులు దీనికి ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. ముఖ్యంగా టెస్టుల్లో ఆ టీమ్​ను ఓడించడం చాలా కష్టమైన పని. అయితే టీ20ల్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని చెప్పాలి. ఓవరాల్​గా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 26 టీ20 మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచుల్లో నెగ్గగా.. సౌతాఫ్రికా 8 మ్యాచుల్లో విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచులు రద్దయ్యాయి. సిరీస్​ల పరంగా చూసుకుంటే.. ఈ రెండు జట్ల మధ్య ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు ఉన్న సిరీస్​లు ఐదు జరిగాయి. అందులో భారత్ రెండింటిని, సౌతాఫ్రికా ఒక్క సిరీస్​ను దక్కించుకోగా.. మరో రెండు సిరీస్​లు డ్రాగా ముగిశాయి. పొట్టి ఫార్మాట్​లో టీమిండియా-సౌతాఫ్రికా ఫస్ట్ టైమ్ 2006లో, ఆఖరుగా 2022 వరల్డ్ కప్​లో తలపడ్డాయి.

ఇక, సౌతాఫ్రికా సిరీస్​కు సెలక్ట్ అయిన టీమ్​లో సీనియర్ మహ్మద్ షమి ఆడటం డౌట్​గా మారింది. గాయంతో బాధపడుతున్న వెటరన్ పేసర్ ప్రొటీస్​తో టెస్ట్ సిరీస్​కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. అతడు కోలుకునేందుకు మరింత టైమ్ పడుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పూర్తిగా రికవర్ అవ్వకముందే అతడ్ని ఆడిస్తే ఇబ్బందులు తప్పవని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. షమీని ఆడించకపోవచ్చునని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షమి ఇంజ్యురీపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యాడు. సఫారీ సిరీస్​కు అతడు ఫిట్​గా ఉంటాడని భావిస్తున్నానని అన్నారు. షమీతో పాటు గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా విషయం మీదా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​కల్లా అతడు ఫిట్​గా ఉంటాడని చెప్పారు. సౌతాఫ్రికా టూర్ నుంచి భారత జట్టు రిటర్న్ అయిన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెన్యూర్ విషయంలో డెసిజన్ తీసుకుంటామని షా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: IND vs SA: టీమిండియా ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్ టీ20 జరగడం కష్టమే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి