iDreamPost

బుమ్రా ఎమోషనల్ పోస్ట్.. ఈ పొజిషన్​లో ఉండటానికి తనే కారణం!

  • Author singhj Published - 06:35 PM, Thu - 30 November 23

భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో ఈ పొజిషనల్​లో ఉండటానికి తనే కారణమన్నాడు.

భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో ఈ పొజిషనల్​లో ఉండటానికి తనే కారణమన్నాడు.

  • Author singhj Published - 06:35 PM, Thu - 30 November 23
బుమ్రా ఎమోషనల్ పోస్ట్.. ఈ పొజిషన్​లో ఉండటానికి తనే కారణం!

టీమిండియా పేస్ గన్ జస్​ప్రీత్ బుమ్రా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల రిటెన్షనే. క్యాష్ రిచ్ లీగ్​కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షల్​లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వ్యవహరించన తీరు బుమ్రాకు నచ్చలేదని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్​గా ఉన్న హార్దిక్ పాండ్యాను సడన్​గా ముంబై సొంతం చేసుకోవడంతో బుమ్రా కోపంగా ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువ కాలం క్రికెట్​లో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అతడి తర్వాత హార్దిక్​ను కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రీటెయిన్ ప్రక్రియకు ముంబై తెరలేపిందని అంటున్నారు.

ఇన్నాళ్లుగా ముంబై టీమ్​లో ఉంటున్నా బయటి ఫ్రాంచైజీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కాదన్నందుకు ఆఖరికి తనకు ముంబై హ్యాండ్ ఇచ్చిందని బుమ్రా ఫీలవుతున్నాడట. తనను కాదని హార్దిక్​ను కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి రిటెన్షన్​లో తీసుకున్నారని అనుకుంటున్నాడట. ఇన్​స్టాగ్రామ్​లో ముంబై ఇండియన్స్​ పేజీని బుమ్రా అన్​ఫాలో చేయడం.. ఇన్​స్టా స్టోరీలో అతడు పెట్టిన ఒక పోస్టు కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఇన్​స్టాగ్రామ్​లో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడీ పేసుగుర్రం.

బుమ్రా ఇన్​స్టాగ్రామ్​లో తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. తన స్ట్రెంగ్త్ ఆమెనే అంటూ ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఇప్పుడీ స్టేజ్​లో ఉన్నానంటే దానికి అమ్మే కారణమన్నాడు బుమ్రా. తల్లితో కలసి నవ్వులు చిందిస్తూ దిగిన ఓ ఫొటోను అతడు ఈ పోస్ట్​కు జతచేశాడతను. తల్లితో కలసి బుమ్రా దిగిన ఫొటో బాగా వైరల్ అవుతోంది. కాగా, బుమ్రా-పాండ్యా సమస్య గురించి టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దరితో పాటు రోహిత్​ను కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించాలన్నాడు. బుమ్రా ఇబ్బంది పడినట్లు కనిపిస్తే దాన్ని మేనేజ్​మెంట్ సరిచేయాలని.. లేకపోతే భారీ మార్పులు చోటుచేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. మరి.. తల్లి బర్త్​డేకు బుమ్రా ఎమోషనల్ పోస్ట్ పెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్ బిజినెస్! కొంత పెట్టుబడితో నెలకి రూ.50000 సంపాదించే అవకాశం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి