iDreamPost

క్రికెట్ బిజినెస్! కొంత పెట్టుబడితో నెలకి రూ.50000 సంపాదించే అవకాశం!

  • Author singhj Published - 06:07 PM, Thu - 30 November 23

క్రికెట్​ అంటే ఆడటం, చూడటమే అనుకునేరు. ఈ పాపులర్ గేమ్​ వల్ల నెలకు రూ.50,000 వరకు సంపాదించే ఛాన్స్ ఉందని తెలుసా?

క్రికెట్​ అంటే ఆడటం, చూడటమే అనుకునేరు. ఈ పాపులర్ గేమ్​ వల్ల నెలకు రూ.50,000 వరకు సంపాదించే ఛాన్స్ ఉందని తెలుసా?

  • Author singhj Published - 06:07 PM, Thu - 30 November 23
క్రికెట్ బిజినెస్! కొంత పెట్టుబడితో నెలకి రూ.50000 సంపాదించే అవకాశం!

క్రికెట్.. మన దేశంలో ఈ ఆటకి ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. క్రికెట్ చూడటమే కాదు, ఆడటం కూడా అందరికీ ఇష్టమే. ఇక ఈ జనరేషన్ లో అయితే.. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఈ ఆటలో నైపుణ్యం సంపాదించి ప్లేయర్స్ గా సక్సెస్ అయితే కోట్లు వచ్చి పడతాయి. కానీ.. కోట్ల మందిలో ఆ స్థాయిని అందుకునేది వందల మంది మాత్రమే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? క్రికెట్ అంటే అందరికీ ఓ వ్యాపకం మాత్రమే. అయితే.. మీకు తెలుసా? క్రికెట్ నాలెడ్జ్ తో కూడా ఎలాంటి రిస్క్ లేకుండా.. ఓ బిజినెస్ చేయొచ్చు అని? మొదట్లో కాస్త శ్రమ పడితే చాలు.. నెలకి ఎంత లేదన్నా ఒక రూ.50000 వరకు సంపాదించుకోవచ్చని? మరి.. ఇన్నాళ్లు ఆనందాన్ని ఇచ్చిన ఆట ద్వారా లైఫ్ లో సెటిల్ అయిపోయే బిజినెస్ ఎలా చేయొచ్చా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

క్రికెట్ ఆడాలంటే ముఖ్యంగా గ్రౌండ్ చాలా ముఖ్యం. ఊర్లలో అయితే.. ఇలాంటి గ్రౌండ్స్ కి కొదవే ఉండదు. మరి మెట్రో నగరాల్లో పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచనే “బాక్స్ క్రికెట్ కోర్ట్స్ ” అనే ఆలోచనకి తెర లేపింది. దీని కోసం విశాలమైన స్థలం అవసరం లేదు. 22 అడుగుల పిచ్.. దీనికి ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ కొంత ప్లేస్, ఇంకా స్ట్రైట్ లో కొంత దూరంలో బౌండరీ లైన్స్. మొత్తంగా 50 అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ రెడీ చేసుసుకోవచ్చు. కావాల్సింది తక్కువ స్థలమే కాబట్టి మెట్రో సిటీస్ లో కూడా ఇంత ప్లేస్ ఈజీగా లీజుకి దొరుకుద్ది. ఒకవేళ మనం అనుకుంటున్న ఏరియాల్లో పెద్ద బిల్డింగ్స్ ఉంటే.. వాటి పై భాగాన్ని కూడా ఇలా “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” కోసం లీజుకి తీసుకోవచ్చు. ఇక ఆటకి కావాల్సిన మ్యాట్స్, గ్రాస్, క్రికెట్ కిట్స్ కి కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటికి తోడు.. లైటింగ్ సెటప్ అతి ముఖ్యమైంది. దీనికి కాస్త బాగానే ఖర్చు అవుతుంది. కాకుంటే.. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి.. అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

మెట్రో నగరాల్లో క్రికెట్ ఆడే వారి సంఖ్యకి కొదవే ఉండదు. కాకుంటే.. వీరికి గ్రౌండ్స్ ఉండవు. పగటి వేళ క్రికెట్ ఆడే అంత తీరిక ఉండదు. ఇలాంటి వారంతా వీకెండ్స్ లో టీమ్స్ గా “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” ని బుక్ చేసుకోవడం, అక్కడ గంటల సమయం గడపడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి, సరిగ్గా మార్కెటింగ్ చేసుకుని, కోర్ట్స్ నిర్వహణ సరిగ్గా చూసుకుంటే ఈ బిజినెస్ కి తిరుగు ఉండదు. ప్రస్తుతం “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” కు గంటకి రూ.1000 నుండి రూ.1300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకి 100 గంటలు బుకింగ్ జరిగినా.. నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇందులో సగభాగం అన్ని రకాల పెట్టుబడి కింద తీసి పెట్టుకున్నా.. మిగిలిన రూ.50000 ఆదాయంగా పక్కన పెట్టుకోవచ్చు. దీనికి తోడు “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” వద్ద వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ వంటి స్టాల్ ఎలానో పెట్టుకోవచ్చు కాబట్టి.. ఇది అదనపు ఆదాయం అవుతుంది. అయితే.. ఎంత లేదన్నా ఇది చివరికి వ్యాపారం కాబట్టి.. జాగ్రత్తగా చేసుకుంటేనే లాభాలు ఉంటాయి. కాబట్టి.. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మరి.. “బాక్స్ క్రికెట్ కోర్ట్స్” బిజినెస్ ఐడియా ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ విషయంలో అలా చేయడం పిచ్చితనం: ఆండ్రీ రస్సెల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి