Somesekhar
గత కొంతకాలంగా దారుణంగా విఫలం అవుతున్న శుబ్ మన్ గిల్ కు టీమిండియా మేనేజ్ మెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే గిల్ ఒళ్లు దగ్గపెట్టుకుని ఆడాడు ఈ ఇన్నింగ్స్ లో..
గత కొంతకాలంగా దారుణంగా విఫలం అవుతున్న శుబ్ మన్ గిల్ కు టీమిండియా మేనేజ్ మెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే గిల్ ఒళ్లు దగ్గపెట్టుకుని ఆడాడు ఈ ఇన్నింగ్స్ లో..
Somesekhar
సాధారణంగా క్రికెటర్ల కెరీర్ లో ఎన్న ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎలాంటి దిగ్గజ ఆటగాడికైనా ఒకానొక దశలో విమర్శలు తప్పవు. ఇక యువ క్రికెటర్లనైతే.. కొన్ని మ్యాచ్ లు సరిగ్గా ఆడకపోతే ఇతడ్ని ఎందుకు ఆడిస్తున్నారు? టీమ్ లో నుంచి తీసేయండి అంటూ విమర్శలు రావడం మనం చూసే ఉన్నాం. తాజాగా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నాడు టీమిండియా యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్. గత కొంత కాలంగా పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న గిల్.. ఒకే ఒక్క సెంచరీతో అందరికి సమాధానం ఇచ్చాడు. అయితే ఇదంతా పైకి కనపడుతోంది. కానీ లోపల జరిగిన కథ వేరే ఉంది. గిల్ కు మేనేజ్ మెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
శుబ్ మన్ గిల్.. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు. పూర్ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. గిల్ గత 10 ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే. ఇక ఈ పది ఇన్నింగ్స్ ల్లో గిల్ అత్యధిక స్కోర్ 36 అంటేనే అర్ధం చేసుకోవచ్చు అతడు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటుగా ఇతర దేశాల దిగ్గజ ఆటగాళ్లు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదంతా తెర ముందు జరిగిన కథ. కానీ తెర వెనక జరిగిన స్టోరీ వేరేఉందని చాలా కొద్ది మందికే తెలుసు. అసలు విషయం ఏంటంటే?
హైదరాబాద్ టెస్టులో డకౌట్ అయిన తర్వాత శుబ్ మన్ గిల్ కు టీమిండియా మేనేజ్ మెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చిందట. నువ్వు ఇలాగే పూర్ ఫామ్ ను కొనసాగిస్తే, నీ నం.3 పొజిషన్ కు గండం ఉన్నట్లే అని మేనేజ్ మెంట్ గిల్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం. వైజాగ్ తో జరిగే టెస్ట్ నీకు ఆఖరి ఛాన్స్ అని సెలెక్టర్ల బృందం గిల్ కు కౌంటర్ ఇచ్చింది. దీంతో గిల్ పై తీవ్ర ఒత్తిడి పడింది. అయినప్పటికీ.. ఆ ఒత్తిడిని జయించి, కీలక సమయంలో టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందిచాడు. మరోవైపు గిల్ స్థానానికి ఎసరుపెట్టడానికి సీనియర్ ప్లేయర్ పుజారా రెడీగా ఉన్నాడు. రంజీల్లో అతడు సత్తాచాటుతున్నాడు. ఇన్ని సమస్యల నేపథ్యంలో గిల్ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు ఈ సెంచరీ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. గిల్ కు మేనేజ్ మెంట్ వార్నింగ్ ఇవ్వడంతోనే జాగ్రత్తగా ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మరి నిజంగానే గిల్ కు మేనేజ్ మెంట్ వార్నింగ్ ఇచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shubman Gill after the Hyderabad Test was told by the management that Vizag would be his last chance to retain his No.3 spot in the team. (Indian Express). pic.twitter.com/ZY2e789KaN
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 4, 2024
ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ మాస్టర్ మైండ్! ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో అన్ని అద్భుతాలే!