iDreamPost

కోహ్లీ, రోహిత్‌ రిటైర్‌ అయితే..? అనే భయం వద్దు! వీళ్లు ఉన్నారుగా!

  • Published Mar 09, 2024 | 6:20 PMUpdated Mar 09, 2024 | 6:20 PM

Rohit Sharma, India vs England: ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ విజయం తర్వాత.. ఇండియన్‌ క్రికెట్‌లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది రోహిత్‌, కోహ్లీ రిటైర్‌ అయితే ఎలా అనే భయాన్ని తగ్గించేలా ఉంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, India vs England: ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ విజయం తర్వాత.. ఇండియన్‌ క్రికెట్‌లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది రోహిత్‌, కోహ్లీ రిటైర్‌ అయితే ఎలా అనే భయాన్ని తగ్గించేలా ఉంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 09, 2024 | 6:20 PMUpdated Mar 09, 2024 | 6:20 PM
కోహ్లీ, రోహిత్‌ రిటైర్‌ అయితే..? అనే భయం వద్దు! వీళ్లు ఉన్నారుగా!

ఇంగ్లండ్‌ లాంటి పటిష్టమైన టీమ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుని టీమిండియా ఫుల్‌ హ్యాపీగా ఉంది. విరాట్‌ కోహ్లీ, మొహమ్మద్‌ షమీ లేకపోయినా.. భలే గెలిచారు అని ఫ్యాన్స్‌ కూడా అనుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ను ఏలుతున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌ అయితే టీమిండియా పరిస్థితి ఏంటో? అనే భయం చాలా మంది క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వాళ్లిద్దరు టీమ్‌ను ఎలా నడిపించారో అంతా చూశారు. అప్పటి వరకు టీ20లకు వాళ్లు అక్కర్లేదు అన్నోళ్లు కూడా.. వామ్మో వాళ్లిద్దరు లేకుంటే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో పరువు కూడా నిలబడదు. వాళ్లు టీమ్‌లో ఉండాల్సిందే అని అన్నారు. వాళ్లిద్దరూ లేని టీమ్‌ను ఊహించుకోవడం చాలా కష్టం. కానీ, ఇప్పుడా భయం అక్కర్లేదేమో అనిపిస్తుంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

కోహ్లీ, రోహిత్‌ లేని లోటుని భర్తీ చేయడం అంతా ఈజీ కాకపోయినా.. ఇప్పుడున్న యువ క్రికెటర్లను కూడా తక్కువ అంచనా వేయలేం. అందుకు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ సిరీస్‌లో కోహ్లీ, షమీ లేరు. కేఎల్‌ రాహుల్‌ నాలుగు టెస్టులకు దూరం అయ్యాడు. అలాగే జడేజా, బుమ్రా లాంటి సీనియర్లు ఒక్కో మ్యాచ్‌ ఆడలేదు. రోహిత్‌ శర్మ, అశ్విన్‌ ఇద్దరే టీమ్‌లో సీనియర్లుగా ఉన్నారు. మిగతా వాళ్లంతా జూనియర్లు. టెస్టుల్లో అంతగా అనుభవం లేని ఆటగాళ్లు. పైగా చాలా మంది ఈ సిరీస్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఉన్నారు. రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, దేవదత్తా పడిక్కల్‌.. ఇలా వీళ్లంతా డెబ్యూ ప్లేయర్లు. అయినా కూడా టీమిండియా 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఈ లెక్కన కోహ్లీ, షమీ, రాహుల్‌ లాంటి సీనియర్ల అవసరం లేదని కాదు కానీ.. మన యంగ్‌స్టర్స్‌ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అందులోనా ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్ దీప్‌, దేవదత్త్‌ పడిక్కల్‌.. ఈ కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. వీళ్ల ఆట తీరు చూస్తుంటే.. టీమిండియా భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని అనిపిస్తోంది. ఈ సిరీస్‌లో గిల్‌ రెండు సెంచరీలతో 452 పరుగులు చేశాడు. యువ ఓపెనర్‌ జైస్వాల్‌ రెండు డబుల్‌ సెంచరీలు బాది ఈ సిరీస్‌లో ఏకంగా 712 పరుగులు చేశాడు. సర్ఫారాజ్‌ ఖాన్‌ మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి 200 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కుల్దీప్‌ యాదవ్‌ 19 వికెట్లు తీసుకున్నాడు. అందులో ఒక 5 వికెట్‌ హాల్‌ కూడా ఉంది. 92 పరుగులు కూడా చేశాడు. ధృవ్‌ జురెల్‌ 190 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ అయితే అదరగొడుతున్నాడు. దేవదత్త్‌ పడిక్కల్‌ చివరి టెస్ట్‌తో అరంగేట్రం చేసి.. తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌ దీప్‌ నాలుగో టెస్టులో 3 వికెట్లతో తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు.

ఇలా యువ క్రికెటర్లంతా ఈ సిరీస్‌లో అదరగొట్టారు. రోహిత్‌ శర్మ, బుమ్రా, జడేజా, అశ్విన్‌ లాంటి సీనియర్లతో పాటు ఈ యువ క్రికెటర్లు రాణించడంతోనే ఇంగ్లండ్‌పై ఇంత అద్భుతమైన సిరీస్‌ విజయం సాధ్యమైంది. జైస్వాల్‌ రూపంలో అద్భుతమైన ఓపెనర్‌, గిల్‌ రూపంలో వన్‌ డౌన్‌ బ్యాటర్‌ కమ్‌ కెప్టెన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, దేవదత్త్‌ పడిక్కల్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు, ధృవ్‌ జురెల్‌ అద్భుతమైన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌, కుల్దీప్‌ రూపంలో ఒక స్పిన్‌ మెజిషీయన్‌ టీమిండియాకు దొరికినట్లు అయింది. వీళ్లను చూస్తుంటే.. భవిష్యత్తులో కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌ అయిపోయినా కూడా టీమిండియా అంత ఇబ్బంది పడదేమో అనిపిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి