iDreamPost
android-app
ios-app

వీడియో: స్కూల్లో టీచర్ల ఫైటింగ్.. ఏడుగురికి గాయాలు!

కేరళలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కొందరు టీచర్స్ ఏకంగా క్లాస్ రూమ్ లోనే కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

కేరళలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కొందరు టీచర్స్ ఏకంగా క్లాస్ రూమ్ లోనే కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

వీడియో: స్కూల్లో టీచర్ల ఫైటింగ్.. ఏడుగురికి గాయాలు!

మాములుగా స్కూల్లో అప్పుడప్పుడు విద్యార్థులు కొట్టుకుంటు ఉంటారు.  దీంతో క్లాస్ టీచర్స్ వెంటనే అప్రమత్తమై వారికి నచ్చ గొడవను సద్దుమణిగిస్తారు. ఆ తర్వాత పాఠశాలలో గొడవ పడ్డందుకు వారికి శిక్ష కూడా విధిస్తారు. ఇలాంటి ఘటనలు ప్రతీ స్కూల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ, పాఠశాలలో చదువు చెప్పే టీచర్స్ కొట్టుకోవడం మీరెప్పుడైనా చూశారా? టీచర్లు కొట్టుకోవడం ఏంటని షాక్ కు గురవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ ప్రాంతంలో మాత్రం చదువు చెప్పే గురువులే ఏకంగా క్లాస్  రూమ్ లో పిల్లల ముందే ఒకరిపై ఒకరు ఇష్టమొచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. వీరు అలా దాడి చేసుకోవడంతో విద్యార్థులు భయందోళలను గురయ్యారు. అయితే, ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అసలు స్కూల్లో టీచర్లు కొట్టుకోవడం ఏంటి? వీరి గొడవకు కారణం ఏంటి? ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం ఉత్తర కేరళ జిల్లా ఎరవన్నూరులోని ఉన్న ఏయూపీ స్కూల్ లో కొందరు టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఆ స్కూల్లో  ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో అందరు టీచర్స్ హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. మరో స్కూల్ టీచర్ వచ్చి ఏయూపీ మాస్టార్లతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో మాటా మాటా పెరిగి చివరికి వాళ్లు కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు ఆ టీచర్లు ఇష్టమొచ్చినట్లుగా దాడి చేసుసుకున్నారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. కాగా, వీరి దాడిలో ఏకంగా ఏడుగురు టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన కొందరు స్థానికులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే.. వీరిపై శాఖ పరమైన చర్యలకు సిద్దమైనట్లు పోలీసులు తాజాగా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన గురువులే ఇలా కొట్టుకుంటే.. చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. మంచి హోదాలో ఉన్న ఈ టీచర్లు చిన్న పిల్లల మాదిరి ఇలా కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. వీరి గొడవకు కారణం తెలియాల్సి ఉంది. స్కూల్లో ఫైటింగ్ చేసుకున్న ఈ టీచర్ల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş