ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా ఆసక్తికరంగా కనిపిస్తోన్నాయి. ముఖ్యంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలానే పార్టీలు ఏర్పాటు చేసే ప్లెక్సీలు కూడా పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. ‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ అంటూ పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో పెత్తందారులవైపు చంద్రబాబు, పేదల వైపు జగన్ ఉన్నట్లు చూపిస్తారు. ఆ పోస్టర్ లోని అర్థాన్ని టీడీపీ కార్యకర్తలు నిజం చేశారు. అసలు అందులోని అర్థం ఏమిటి?, తెలుగు తమ్ముళ్లు దానిని నిజం చేయడం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతకాలం క్రితం ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించి ఓ పోస్టర్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ పోస్టర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయింది. పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అంటూ రాసి పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్ లో పేదల వైపు జగన్ నిలబడి ఉంటే పెత్తందారుల వైపు చంద్రబాబు అండ్ కో ఉంది. అలానే పెత్తందారుల వైపు నుంచి పేదలపై రాళ్లు విసురుతుంటే.. జగన్ వారికి అడ్డుగా ఉన్నారు. అంతే ఆ పోస్టర్ ను సమర్థిస్తూ వైసీపీ నేతలు అనేక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతో పాటు ఆ పార్టీలోని పెత్తందారుల నుంచి పేదలను కాపాడేందుకు జగన్ వారితో యుద్ధం చేస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. అలానే చాలా మందికి కూడా ఈ పోస్టర్ లో ఉన్నది నిజమేనంటూ గట్టిగానే స్పందించారు. అయితే ఈ పోస్టర్ ను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఇతర ముఖ్యనేతలు కూడా వ్యతిరేకించారు. అసలు పెత్తందారుడు జగన్ మోహన్ రెడ్డే అంటూ ఆయనపై అనేక విమర్శలు చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం జగన్ ఇలాంటి పోస్టర్లను ఏర్పాటు చేయించారని వారు ఆరోపించారు. ఆ పోస్టర్ ఎలాంటి వాస్తవం లేదంటూ తెలుగు తమ్ముళ్లు చెప్పుకొచ్చారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఆ పోస్టర్ ను టీడీపీ కార్యకర్తలు నిజం చేశారు. పాదయాత్రకు జనాదరణ రాకపోవడంతో ఘర్షణలు సృష్టించడం ద్వారా లబ్ధి పొందడానికి టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ ప్లెక్సీ కనిపించినా, వైసీపీ జెండా కనిపించినా ఓర్వలేని రీతిలో పాదయాత్రలో టీడీపీ అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. పెత్తందారులకు పేదలకు మధ్య జరిగే యుద్ధం అంటూ సీఎం జగన్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పైకి టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసరడం చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ల లో ఉన్నదాన్ని నిజం చేశారు కదరా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీలాంటి కులోన్మాదులు, ధనోన్మాదుల నుంచి ప్రజలను, రాష్ట్రాని కాపాడటమే జగన్ ధ్యేయమని చూపించిన ఆ పోస్టర్ అర్ధాన్ని నిజం చేశారు.. శభాష్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.