iDreamPost

శ్రీ సత్య సాయి జిల్లాలో TDPకి భారీ దెబ్బ!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ సింగిల్ గా పోటీ చేయనున్నారు. అలానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇలా కూటమిగా ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ గట్టి ఎదురు దెబ్బలే తగలుతున్నాయి.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ సింగిల్ గా పోటీ చేయనున్నారు. అలానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇలా కూటమిగా ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ గట్టి ఎదురు దెబ్బలే తగలుతున్నాయి.

శ్రీ సత్య సాయి జిల్లాలో TDPకి భారీ దెబ్బ!

ఏపీలో ఎన్నికల వేడీ బాగా ముదిరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేపట్టారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో టీడీపీకి మాత్రం ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ సింగిల్ గా పోటీ చేయనున్నారు. అలానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇలా కూటమిగా ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ గట్టి ఎదురు దెబ్బలే తగలుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీని వదలి వైసీపీ తీర్థం పుంచుకున్నారు. అలానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ.. ఆ పార్టీ నేతలు షాకిస్తున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. 2009 నుంచి ఆ పార్టీలో గట్టి పట్టున్న అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టా పురుషోత్తమరెడ్డి, ఆయన సోదరుడు మల్లికార్జునరెడ్డి, రిటైర్డ్‌ డీఎస్పీ వేణుగోపాల్‌తో పాటు పలువురు వడ్డెర సామాజికవర్గ నాయకులు వైసీపీలో చేరారు.

సోమవారం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలిసి బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శిబిరంలో సీఎం జగన్‌ను వారు కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పుట్టపర్తి నియోజవర్గంలోని అమడగూరు మండలంలో పురుషోత్తమరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలానే స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చేరికతో టీడీపీ బలమైన ఓటు బ్యాంకును కోల్పోయినట్లయిందని స్థానికులు అభిప్రాయా పడుతున్నారు.

ఇక రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్‌.. చంద్రబాబు మాటలు నమ్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టికెట్ ఇస్తానని నమ్మించి…తనను దారుణంగా మోసగించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వేణుగోపాల్‌ ప్రకటించారు. కొత్తచెరువు మండలం వడ్డెర కులానికి పలువురు ముఖ్య నేతలు కూడా సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా టీడీపీ వరుస దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్ర ఆరో రోజు కొనసాగుతోంది.   ఆరో  రోజు బస్సుయాత్ర అన్నమయ్య జిల్లాలో జరగుతుండగా.. జనం పెద్ద సంఖ్యలో హాజరై.. సీఎం జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ఓ వైపు ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూసుకెళ్తుంటే..మరోవైపు కూటమిలో మాత్రం అసంతృప్తులతో రచ్చ రచ్చగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి