iDreamPost

PAK vs NZ: క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి బ్యాటింగ్ చూసుండరు.. గాల్లోనే..! వీడియో వైరల్..

పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ ఏకంగా స్పైడర్ మెన్ లా విన్యాసం చూస్తూ.. బ్యాటింగ్ చేసిన విధానం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ విచిత్రమైన షాట్ మనమూ చూద్దాం పదండి.

పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ ఏకంగా స్పైడర్ మెన్ లా విన్యాసం చూస్తూ.. బ్యాటింగ్ చేసిన విధానం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ విచిత్రమైన షాట్ మనమూ చూద్దాం పదండి.

PAK vs NZ: క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి బ్యాటింగ్ చూసుండరు.. గాల్లోనే..! వీడియో వైరల్..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో చిత్ర విచిత్రమైన విన్యాసాలు నమోదు అవుతూ ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఫీల్డింగ్ లో మనకు కనిపిస్తాయి. ఇక బ్యాటింగ్ లో అలాంటి విన్యాసాలు తక్కువే గానీ విభిన్నమైన షాట్స్ ఆడుతూ.. ప్రేక్షకులను అలరిస్తుంటారు ప్లేయర్లు. అయితే నిన్న(ఏప్రిల్ 27) పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ విచిత్రమైన షాట్ అందరిని షాక్ కు గురిచేసింది. న్యూజిలాండ్ బ్యాటర్ ఏకంగా స్పైడర్ మెన్ లా విన్యాసం చూస్తూ.. బ్యాటింగ్ చేసిన విధానం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ విచిత్రమైన షాట్ మనమూ చూద్దాం పదండి.

పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన క్రికెట్ షాట్ నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అమిర్ వికెట్లకు దూరంగా ఆఫ్ సైడ్ వైడ్ బాల్ ను సంధించాడు. అయితే ఆ బాల్ ను ఆడేందుకు న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ స్టిఫర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బాల్ బ్యాట్ కు అందుకున్నా గానీ..అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని కొట్టబోయాడు. కానీ బాల్ బ్యాట్ కు తాకలేదు. అయితే అతడి విన్యాసం మాత్రం ఆకట్టుకుంది. సహజంగా ఇలాంటి విన్యాసాలు ఫీల్డింగ్ లో మాత్రమే చూస్తాం. కానీ స్టిఫర్ట్ మాత్రం బ్యాటింగ్ లో చేసి చూపించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి హైలెట్ అయ్యాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం 179 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయ్యి, 9 పరుగులతో ఓడిపోయింది. డైవ్ షాట్ తో విన్యాసం చేసిన స్టిఫర్ట్(52) థండర్ ఫిఫ్టీతో రాణించినా.. టీమ్ ను గెలిపించలేకపోయాడు. ఇక ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-2తో డ్రా చేసుకున్నాయి ఇరు జట్లు. కాగా.. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మరి స్పైడర్ మెన్ లా బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి