iDreamPost

Hardik Pandya: ప్లానింగ్ లేని కెప్టెన్ పాండ్యా.. అతడికి బుర్ర పనిచేయడం లేదు: భారత మాజీ క్రికెటర్

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనుసరించే వ్యూహాలపై మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడికి ప్లానింగ్ లేదని, మైండ్ దొబ్బిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు కైఫ్.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనుసరించే వ్యూహాలపై మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడికి ప్లానింగ్ లేదని, మైండ్ దొబ్బిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు కైఫ్.

Hardik Pandya: ప్లానింగ్ లేని కెప్టెన్ పాండ్యా.. అతడికి బుర్ర పనిచేయడం లేదు: భారత మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు కెప్టెన్సీ కష్టాలు.. మరోవైపు వరుస ఓటములు. ఇక ఇవన్నీ చాలవన్నట్లుగా ప్రేక్షకుల విమర్శలు. ఇవన్నీ కలిసి పాండ్యాను మానసికంగా కుంగదీస్తున్నాయి. దీంతో అతడు కెప్టెన్ గా సఫలం కాలేకపోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో అనుసరించే వ్యూహాలపై కైఫ్ మండిపడ్డాడు. పాండ్యాకు బుర్ర పనిచేయడం లేదంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని భారీ స్కోర్ గా మలిచి, టీమ్ కు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడని మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడికి బుర్ర పనిచేయడం లేదని మండిపడ్డాడు.

“ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా మైండ్ అస్సలు పనిచేయట్లేదు. అతడు ఏం చేస్తున్నాడో.. అతడికే తెలియడం లేదు. కొన్ని సార్లు ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు, మరికొన్ని సార్లు 5వ ఓవర్ వేయడానికి వస్తాడు. నాకు తెలిసి పాండ్యా ఎలాంటి ప్లాన్స్ లేకుండానే కెప్టెన్సీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది అత్యంత దారుణం. పాండ్యా తన తీరు మార్చుకోకపోతే.. చాలా కష్టం” అని విమర్శించి, హెచ్చరించాడు మహ్మద్ కైఫ్. ప్రస్తుతం కైఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఢిల్లీ పై ఓటమితో ముంబై తన ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరి కైఫ్ అన్నట్లుగానే పాండ్యాకు నిజంగానే మైండ్ దొబ్బిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి