iDreamPost

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై చిరుత కలకలం.. భయంతో పరుగుతు తీస్తోన్న సిబ్బంది

  • Published Apr 28, 2024 | 1:41 PMUpdated Apr 28, 2024 | 1:41 PM

భాగ్యనగరం నడి బొడ్డున చిరుత సంచారం కలకలం రేపుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వేపై చిరుత కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు..

భాగ్యనగరం నడి బొడ్డున చిరుత సంచారం కలకలం రేపుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వేపై చిరుత కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 1:41 PMUpdated Apr 28, 2024 | 1:41 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై చిరుత కలకలం.. భయంతో పరుగుతు తీస్తోన్న సిబ్బంది

అడవిలో ఉండాల్సిన జంతువులు, అందునా క్రూర మృగాలు.. జనారణ్యంలోకి వచ్చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్నిసార్లు జనాలపై దాడి చేసి.. ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మరి ఇందుకు కారణం ఏంటి అంటే.. ఏముంది… మనిషి స్వార్థంతో అడవి జంతువులు నివాసాల్లోకి చొచ్చుకుపోతే.. ఆవాసం కోల్పోయి.. ఆకలి, దప్పిక తీర్చుకోవడం కోసం ఆ జంతువులు మనుషులు ఉండే ప్రాంతాల్లోకి వస్తున్నాయి అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. కేవలం పల్లే ప్రాంతాల్లోకి మాత్రమే కాకుండా పట్టణాల్లోకి కూడా చొచ్చుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆవివరాలు..

హైదరాబాద్‌, శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్‌ పోర్ట్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది.. రన్‌వేపై చిరుతను గుర్తించారు. చిరుత ఇంకా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. చిరుత సంచారాన్ని గమనించిన విమానాశ్రయ సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు.. శంషాబాద్‌ విమానాశ్రయం వద్దకు చేరుకున్న ఆ పరిసరాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక, చిరుత సంచారం గురించి తెలుసుకున్న ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది బిక్కబిక్కుమంటు గడుపుతున్నారు.

అయితే, దాదాపు మూడేళ్ల కిందట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత లోపలికి వెళ్లినట్లు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దానిని పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేసి, గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే, 2019 నవంబరు 27న విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఫారెస్ట్, జూ అధికారులను అక్కడకు రప్పించారు. రెండుగంటల పాటు ముమ్మరంగా గాలించగా.. అది చిరుత కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికది చిరుత పులి కాదు అడవి పిల్లి అని తేల్చారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి రేపుతోంది. అయితే అది చిరుతేనా.. లేక గతంలో మాదిరి అడవి పులా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి