iDreamPost

YSR Aarogyasri: బకాయిలు విడుదల.. యథావిధిగానే ఆరోగ్యశ్రీ సేవలు: ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ లక్ష్మిషా

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఏలాంటి ఇబ్బందులు కలకుండా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఏలాంటి ఇబ్బందులు కలకుండా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

YSR Aarogyasri: బకాయిలు విడుదల.. యథావిధిగానే ఆరోగ్యశ్రీ సేవలు: ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ లక్ష్మిషా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్య శ్రీలో అనేక కొత్త రకాల చికిత్సలను తీసుకొచ్చి..పేదవారికి ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఇది ఇలా ఉంటే… ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపోనున్నాయి అనే వార్తలు వచ్చాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్  అసోషియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని సమాచారం ఈ నేపథ్యంలో  ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.203 కోట్లు బిల్లు చెల్లింపులు  చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ లక్ష్మిషా మంగళవారం తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లింపులు చేపడతామని ఆయన తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు  ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈవో డాక్టర్ లక్ష్మిషా తెలిపారు.

ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగష్టు నుంచి బకాయిబడిన రూ.1500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని అసోసియోషన్ డిమాండ్ చేసింది. ఈ  పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే సేవల్ని నిలిపివేస్తామనిఅసోసియేషన్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే  పెండింగ్ బిల్లులో 203 కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. మిగిలిన బిల్లలులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ లక్ష్మిషా స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి