iDreamPost

RCB vs RR: చాహల్ రేర్ ఫీట్.. IPL హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డు!

  • Published May 22, 2024 | 9:02 PMUpdated May 22, 2024 | 9:11 PM

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు.

ఐపీఎల్-2024 ఆసాంతం అద్భుతమైన బౌలింగ్​తో అదరగొట్టాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. మణికట్టు మాయాజాలంతో రాజస్థాన్ రాయల్స్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్​తో కలసి ప్రత్యర్థి జట్ల పనిపట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న ఎలిమినేటర్​లోనూ అతడు తన మ్యాజిక్​ను కంటిన్యూ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ (33)ను వెనక్కి పంపాడు చాహల్. ఈ వికెట్​తో అతడు చరిత్ర సృష్టించాడు.

యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్​కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు. కోహ్లీని ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్​ (66 వికెట్లు)గా అవతరించాడు చాహల్. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీకి కూడా ఇంకా అతడే హయ్యెస్ట్ వికెట్ టేకర్ (139 వికెట్లు)​గా ఉన్నాడు. ఇలా ఐపీఎల్​లో రెండు జట్ల తరఫున టాప్ వికెట్ టేకర్​గా నిలిచిన ఒకే ఒక బౌలర్​గా చాహల్ రేర్ ఫీట్ నమోదు చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి