iDreamPost

టాటా నానో కంటే చిన్న కారు.. దీని గురించి తెలుసా?

టాటా నానో కారే చిన్నది అనుకుంటే దాని కంటే చిన్న సైజులో ఒక కారుని టాటా కంపెనీ తయారు చేసిందని మీకు తెలుసా?

టాటా నానో కారే చిన్నది అనుకుంటే దాని కంటే చిన్న సైజులో ఒక కారుని టాటా కంపెనీ తయారు చేసిందని మీకు తెలుసా?

టాటా నానో కంటే చిన్న కారు.. దీని గురించి తెలుసా?

టాటా నానో కారు అప్పట్లో ఒక సంచలనం. లక్ష రూపాయల ధరతో మధ్యతరగతి వారి కోసం తీసుకొచ్చిన కారు ఇది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కారు మార్కెట్లో ఫెయిల్ అయ్యింది. అయితే మీకో విషయం తెలుసా? నానో కంటే ముందుగానే టాటా మోటార్స్ కంపెనీ దాని కంటే చిన్న సైజు కారుని తయారు చేసింది. నానో కారే అనుకుంటే ఈ కారు దాని కంటే చిన్నది. ఆ కారు  పేరు టాటా జింగ్. టాటా నానో కారుతో పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది. టాటా ఇండికా కారుని డిజైన్ చేస్తున్న సమయంలోనే జింగ్ కారుని కూడా డిజైన్ చేస్తుంది. టాటా ఇండికా కారుని మార్కెట్లో రిలీజ్ చేసినప్పటి నుంచే అందరికీ అందుబాటులోకి ఒక కారుని తీసుకురావాలని రతన్ టాటా భావించారు. ఆ సమయంలో నానో కారుని రూపొందిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా జింగ్ కారుని డెవలప్ చేశారు.

ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా, ట్రాఫిక్ లో కూడా సులువుగా నడపగలిగేలా ఈ కారుని తయారు చేశారు. మిడిల్ క్లాస్ వారు కొనగలిగే ధరకే తయారు చేశారు. కారులో స్పేస్ విషయంలో రాజీ పడకూడదని ఇంజిన్ ని కారు ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో అమర్చారు. ముందు భాగంలో ఇంజిన్ లేకపోవడం వల్ల ఈ కారుని డ్రైవ్ చేయడం కూడా సులువుగా ఉంటుంది. ఈ కారుని తయారు చేసేందుకు బాష్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది టాటా మోటార్స్. సైజు చిన్నదే అయినప్పటికీ ఈ కారులో 4 డోర్లను పెట్టారు. అయితే బూట్ స్పేస్ కోసం వెనక డోర్ ఉండదు. ఇక ఈ కారులో 2 సిలిండర్ ఇంజిన్ ని పెట్టారు. బరువు తక్కువగా ఉండడం వల్ల మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మరి ఇంత తక్కువ ధరకి.. అధిక మైలేజ్ ఇచ్చే కారుని ఎందుకు మార్కెట్లోకి విడుదల చేయలేదు అంటే రతన్ టాటా రాజీపడకపోవడమే అందుకు కారణం.

జింగ్ కారుని అనుకున్నట్టే సరసమైన ధరకు అందించాలని అనుకున్నా కానీ ఆ ధరలో బిల్ట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా లేదన్న ఒకే ఒక్క కారణంతో ఆ కారుని ఆపేశారు. తక్కువ ధరకి కారుని అందించడం కన్నా బలహీనమైన కారుని అందించకపోవడమే ఉత్తమం అని టాటా మోటార్స్ భావించి వెనకడుగు వేసింది. టాటా కంపెనీ బిల్డ్ క్వాలిటీ విషయంలో రాజీ పడదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా అదే బిల్డ్ క్వాలిటీని మెయింటెయిన్ చేస్తూ వస్తుంది. అందుకే క్రాష్ టెస్ట్ లో టాటా కార్లు 5 స్టార్ రేటింగ్ పొందుతున్నాయి. నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే రానుంది. దీన్ని కూడా తక్కువ ధరకే సామాన్యులకి అందించాలన్న ఉద్దేశంతో తయారు చేస్తుంది టాటా మోటార్స్ కంపెనీ. అలా టాటా నానో కంటే ముందే దాని కంటే చిన్న సైజులో టాటా జింగ్ కారుని రూపొందించారు. కానీ రతన్ టాటా అనుకున్న మిడిల్ క్లాస్ బడ్జెట్ లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో ఇవ్వలేమని తెలిసి ఆపేశారు. అదే వేరే కంపెనీ అయితే ఎవరెలా పోతే మనకేంటి అని మార్కెట్లోకి వదిలేవారు. టాటా అంటే మోరల్ వాల్యూస్. టాటా అంటే ఒక ట్రస్ట్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి