Dharani
Wiz Rejected A Rs 200000 Cr Offer From Google: ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ నుంచి వచ్చిన లక్షల కోట్ల రూపాయల ఆఫర్‌ను కాదనుకుంది ఓ స్టార్టప్ కంపెనీ. ఆ వివరాలు..
Wiz Rejected A Rs 200000 Cr Offer From Google: ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ నుంచి వచ్చిన లక్షల కోట్ల రూపాయల ఆఫర్‌ను కాదనుకుంది ఓ స్టార్టప్ కంపెనీ. ఆ వివరాలు..
Dharani
గూగుల్ ప్రపంచ అగ్రగామి సంస్థ. ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని.. దీనితో టైఅప్ కావాలని చాలా మంది ఆశపడతారు.. కొందరైతే అదే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ టెక్ దిగ్గజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ కంపెనీ నుంచి ఆఫర్ వస్తే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక తమ దశ తిరిగిందని భావిస్తారు. గూగుల్‌తో జత కట్టే అవకాశం వస్తే.. ఏ కంపెనీ వదులుకోదు.. అందునా స్టార్టప్స్ సంగతి చెప్పక్కర్లేదు. కళ్లు మూసుకుని గూగుల్ ఆఫర్‌ని ఓకే చేస్తాయి. అంత క్రేజ్ ఈ కంపెనీకి. కానీ తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గూగుల్ ఇచ్చిన ఆఫర్‌ని ఓ స్టార్టప్ కాదనుకుంది. అది కూడా 2 లక్షల కోట్ల రూపాయల ఆఫర్‌ని. ఇంతకు ఆ స్టార్టప్ కంపెనీ ఏది.. గూగుల్ ఆఫర్‌ని ఎందుకు వదిలేసుకుంది అంటే..
ప్రపంచ అగ్రగామి కంపెనీ అయిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్.. విజ్ అనే సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. ఇందుకోసం భారీ మొత్తాన్ని.. ఏకంగా 23 బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 2 లక్షల కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. గూగుల్ నుంచి ఆఫర్ అంటేనే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అది ఇంత భారీ మొత్తంలో అంటే కళ్లు మూసుకుని ఓకే చెప్తారు. కానీ సదరు విజ్ కంపెనీ మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ భారీ ఆఫర్‌ని కాదనుకుంది. అందుకు గల కారణాలను వివరిస్తూ.. విజ్ సహా వ్యవస్థాపకుడు అసాఫ్ రాపాపోర్ట్ తన సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో వెల్లడించినట్లు సీఎన్‌బీసీ తన నివేదికలో పేర్కొంది.
తమ కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే ఇప్పుడు తమ ముందున్న ప్రధాన ధ్యేయమని.. గూగుల్ ఆఫర్ నో చెప్పడం కష్టమే కానీ.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే తమకు అత్యంత ప్రధానమని ఉద్యోగులకు పంపిన మెమోలో వెల్లడించినట్లు తెలిసింది. విజ్ కంపెనీ ఐపీఓకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉందని.. అలానే వార్షిక రికరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లు సాధించడమే కంపెనీ ముందున్న లక్ష్యమని.. ఇప్పుడు తమ దృష్టంతా దీని మీదే ఉందని అసాఫ్ రాసుకొచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ గురించి ఇటు విజ్ కానీ.. అటు గూగుల్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ విజ్ కంపెనీ గూగుల్ ఆఫర్‌ని అంగీకరించి ఉంటే.. గూగుల్ అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటి అయి ఉండేది.
గత కొన్నాళ్లుగా క్లౌడ్ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో విజ్ అగ్రగామిగా నిలుస్తోంది. ముందుగా దీన్ని ఇజ్రాయేల్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఇది న్యూయార్క్ నుంచి తన కార్యకలాపాలు నిర్వమిస్తోంది. ఇక ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో.. 40 శాతం కంపెనీలు విజ్‌కు క్లయింట్‌లుగా ఉన్నాయి. ఇందులో దాదాపు 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి.