iDreamPost
android-app
ios-app

Rithu Chowdary: హైపర్‌ ఆది వల్లే జబర్దస్త్‌ మానేశా.. సంచలన వ్యాఖ్యలు చేసిన రీతూ చౌదరి

  • Published Jul 27, 2024 | 12:39 PM Updated Updated Jul 27, 2024 | 12:39 PM

Rithu Chowdary-Hyper Aadi, Quitting Jabardasth: బుల్లితెర బోల్డ్‌ బ్యూటీ రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. హైపర్‌ ఆది వల్లే తాను జబర్దస్త్‌ మానేశాను అని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

Rithu Chowdary-Hyper Aadi, Quitting Jabardasth: బుల్లితెర బోల్డ్‌ బ్యూటీ రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. హైపర్‌ ఆది వల్లే తాను జబర్దస్త్‌ మానేశాను అని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 27, 2024 | 12:39 PMUpdated Jul 27, 2024 | 12:39 PM
Rithu Chowdary: హైపర్‌ ఆది వల్లే జబర్దస్త్‌ మానేశా.. సంచలన వ్యాఖ్యలు చేసిన రీతూ చౌదరి

జబర్దస్త్‌.. ఎందరో నూతన కళాకారులకు జీవితాలను ఇచ్చింది. కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. సుమారు దశాబ్ద కాలం క్రితం ప్రారంభమైన ఈ షో.. ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక ఈ షో ద్వారా పరిచయం అయ్యి గుర్తింపు తెచ్చుకుని.. నేడు బుల్లితెర, వెండి తెర మీద రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇక ఈ షోలో ప్రారంభంలో లేడీస్‌ పాత్రల కోసం మగవారు లేడీ గెటప్‌ వేసుకుని యాక్ట్‌ చేసేవారు. ఆ తర్వాత.. లేడీ కంటెస్టెంట్లకు కూడా అవకాశం ఇచ్చారు. అలా జబర్దస్త్‌కు వచ్చి.. విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు.

జబర్దస్త్‌ షోలో పాల్గొన్న తర్వాత నుంచి ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఇక సోషల్‌ మీడియాలో రీతు చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దీని వల్ల కొన్ని సందర్భాల్లో విమర్శలు సైతం మూటగట్టుకుంది. ప్రస్తుతం షోలు, సీరియల్స్‌లో నటిస్తూ.. బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. హైపర్‌ ఆది వల్లే తాను జబర్దస్త్‌ మానేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. వీరిద్దరి మధ్య మంచి కెమస్ట్రీ ఉండేది. దాంతో తెర మీద వీళ్లిద్దరి చనువు చూసి వీరిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటిని ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంత కాలానికి హైపర్‌ ఆది, రీతూ ఇద్దరూ జబర్దస్త్‌ మానేశారు. ప్రస్తుతం ఆమె కిలాడీ గర్ల్స్‌ కిరాక్‌ బాయ్స్‌ అనే షోలో చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్‌ మానేయడానికి గత కారణాలు వివరించింది రీతూ.

నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆది. తను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనొక్కదానినే అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. టీవీషోలు మాత్రమే చేస్తున్నారు.. మూవీ ఆఫర్స్ రావడం లేదా అని ప్రశ్నించగా.. ‘‘ఇండస్ట్రీలో నేను జస్ట్ విజె అవుదాం అని వచ్చాను. ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నా. చాలా షోలు చేస్తున్నా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది.

‘‘సినిమాల్లో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. వాటి కోసం వెళితే ఈ అమ్మాయి బోల్డ్‌గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టం అంటున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ. కాకపోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి’’ అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో గురించి విమర్శించే వారిని పట్టించుకోను అన్నది.