iDreamPost
android-app
ios-app

వీడియో: ఇది కొత్త ట్రెండ్.. విడాకుల పార్టీని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్!

  • Published Jul 27, 2024 | 2:10 PM Updated Updated Jul 27, 2024 | 2:10 PM

Divorce Mubarak: పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని కొంత కాలం హ్యాపీగా ఉన్నజంట పలు కారణాల వల్ల విడిపోతున్నారు. ఇటీవల కొంతమంది డివోర్స్ పార్టీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Divorce Mubarak: పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని కొంత కాలం హ్యాపీగా ఉన్నజంట పలు కారణాల వల్ల విడిపోతున్నారు. ఇటీవల కొంతమంది డివోర్స్ పార్టీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • Published Jul 27, 2024 | 2:10 PMUpdated Jul 27, 2024 | 2:10 PM
వీడియో: ఇది కొత్త ట్రెండ్.. విడాకుల పార్టీని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ప్రపంచంలో పెళ్లి వేడుకలు వారి వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. వివాహబంధంలోకి అడుగు పెట్టిన కొత్త జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. ఇటీవల పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడంలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. పెళ్లి సమయంలో బంధు మిత్రులను ఎలా ఆహ్వానిస్తున్నారో.. విడాకుల తీసుకున్న తర్వాత కూడా అలా పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో ఎక్కడైనా వివాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. బంధువు, స్నేహితులకు ఆహ్వానం పంపి వారి ఆశీర్వాదంతో ఒక్కటవుతారు జంట. పెళ్లి అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప తతంగం.. అప్పు చేసి మరీ గొప్పగా నిర్వహిస్తుంటారు. ఎంతో ఘనంగా జరిగిన పెళ్లిళ్లు ఇటీవల కొద్ది కాలానికే పెటాకులవుతున్నాయి. భార్యాభర్తల మద్య విభేదాలు కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కి చెందిన ఓ మహిళ పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న బాధ ఏమాత్రం లేకుండా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చి హ్యాపీగా సెలబ్రెట్ చేసుకుంది. ఆ పార్టీలో డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది.

ఈ సందర్భంగా ఆ మహిళ చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లూ కలర్ లెహంగాలో ఉన్న ఆమె.. ఆ సంతోషంలో చున్నీ పడేసి మరీ స్టెప్పులు ఇరగదీసింది. డివోర్స్ ముబారక్ పేరుతో పార్టీ అరెంజ్ చేసి.. ఫ్రెండ్స్, చుట్టాలను పిలిచింది సంబరాలు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమె జీవితం ఆమె ఇష్టం అంటూ సపోర్ట్ చేస్తుంటే.. ఇలాంటి మహిళలు ఉన్నందుకు ఆమె భర్త డివోర్స్ తీసుకున్నందుకు సంతోషించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్స్ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş