iDreamPost
android-app
ios-app

రాయన్ vs పురుషోత్తముడుvs ఆపరేషన్ రావణ్.. ఈ మూడిట్లో ఏ సినిమా బాగుందంటే?

  • Published Jul 27, 2024 | 1:24 PMUpdated Jul 27, 2024 | 1:24 PM

Latest Theatre Released Movies: 2024 సెకండ్ ఆఫ్ కల్కి మూవీతో మొదలైంది.. ఇక వరుసగా సినిమాలు థియేటర్ లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో జూలై 26 న థియేటర్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వీటిలో ఏ సినిమాలు ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయనే విషయాలు చూసేద్దాం.

Latest Theatre Released Movies: 2024 సెకండ్ ఆఫ్ కల్కి మూవీతో మొదలైంది.. ఇక వరుసగా సినిమాలు థియేటర్ లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో జూలై 26 న థియేటర్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వీటిలో ఏ సినిమాలు ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయనే విషయాలు చూసేద్దాం.

  • Published Jul 27, 2024 | 1:24 PMUpdated Jul 27, 2024 | 1:24 PM
రాయన్ vs పురుషోత్తముడుvs ఆపరేషన్ రావణ్.. ఈ మూడిట్లో ఏ సినిమా బాగుందంటే?

వరుసగా థియేటర్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో జూలై 26న థియేటర్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే ధనుష్ నటించిన రాయన్ మూవీ, రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు , రక్షిత్ అట్లూరి నటించిన ఆపరేషన్ రావణ్ మూవీ. ఈ మూడు సినిమాలకు కూడా రిలీజ్ కు ముందు.. డీసెంట్ హైప్ క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమాల గురించి చేసిన ప్రమోషన్స్ , విడుదల చేసిన ట్రైలర్స్ ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఒక్కో మూవీ ఒక్కో అవుట్ పుట్ ను ఇచ్చింది. మరి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఓ లుక్ వేసేయండి.

రాయన్:

ఆల్రెడీ ధనుష్ మీద , ధనుష్ మూవీస్ మీద అందరికి మైండ్ లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దీనితో రాయన్ మూవీ రిలీజ్ కు ముందే.. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా తెలుగులో అయితే మొదటి సారి ధనుష్ మూవీ 500కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ మూవీ మాత్రం తెలుగు ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. తన ఫ్యామిలీ మరణానికి కారణం అయినా వారిపై.. రాయన్ , అతని తమ్ముళ్లు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది ఈ మూవీ ప్లాట్. అయితే ఈ మూవీ తెలుగు కంటే కూడా తమిళ ఆడియన్సును మెప్పించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Raayan

పురుషోత్తముడు:

ఎన్నో పర్సనల్ వివాదాల మధ్యలో రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు ఈ మూవీ రాజ్ తరుణ్ కెరీర్ లోనే ఓ మంచి మూవీ అని.. ఈ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ రాజ్ తరుణ్ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేదని టాక్ వినిపించింది. ప్రమోషన్స్ , రిలీజ్ కు ముందు వచ్చిన మూవీ అప్ డేట్స్ కూడా డీసెంట్ హైప్ నే క్రియేట్ చేసిన కానీ.. రిలీజ్ తర్వాత మాత్రం.. ఏ మాత్రం అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోలేకపోయింది. మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఓ కోటీశ్వరుడు కొడుకు.. తన తండ్రి కంపెనీకి సీఈఓ అవ్వడానికి ముందు.. కొన్ని రోజులు తాను ఒక నార్మల్ లైఫ్ ను ఎలా లీడ్ చేయగలిగాడు.. ఈ క్రమంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేది మూవీ ప్లాట్. మరి ఎంత కాలం ఈ మూవీ థియేటర్ లో రన్ అవుతుందో చూడాలి.

purushothamudu

ఆపరేషన్ రావణ్:

ఈ మూవీ ప్రమోషన్స్ ఏ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. నేరాలు ఘోరాలు టైప్ లో ఎలివేషన్స్ ఇస్తూ.. మూవీ గురించి ప్రోమోట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్ బాగానే వైరల్ అయింది కానీ.. థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత మాత్రం ఎందుకో ఆ రేంజ్ లో వైరల్ అవ్వలేకపోయింది. ప్రస్తుతానికైతే ఈ మూవీ థియేటర్స్ లో బాగానే టాక్ సంపాదించుకుంటుంది. లాంగ్ రన్ లో హిట్ టాక్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ , సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికైతే నచ్చుతుంది. మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఓ సైకో కిల్లర్ అనుమానాస్పదంగా దారుణంగా అమ్మాయిలను చంపుతూ ఉంటాడు. అతనిని పట్టుకునే క్రమంలో హీరోతో ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్ట్ కూడా కిడ్నప్ కు గురవుతుంది. ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయనేదే ఈ మూవీ స్టోరీ లైన్.

operation raavan

ఈ మూడు సినిమాలు కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్.. ఈ సినిమానే తప్పకుండ చూడాలని అయితే చెప్పలేము. కాబట్టి , కథను బట్టి, ఇంట్రెస్ట్ ను బట్టి ఏ మూవీని చూడాలి అని డిసైడ్ అవ్వడమే. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి