Arjun Suravaram
Vistara Airlines: టాటా గ్రూప్ కి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన విస్తారా,..తరచూ విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అలానే తాజాగా మరో ఆఫర్ ను ప్యాసింజర్లకు ప్రకటించింది.
Vistara Airlines: టాటా గ్రూప్ కి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన విస్తారా,..తరచూ విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అలానే తాజాగా మరో ఆఫర్ ను ప్యాసింజర్లకు ప్రకటించింది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో విమానాల ప్రయాణలు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అలానే ఈ సేవలను అందిస్తున్న సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. ఇక చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు.. ప్రయాణికులకను ఆకట్టుకునేందుకు వివిధ రకాలా ఆఫర్లను అందిస్తుంటాయి. అంతేకాక ప్రత్యకే సందర్భాల్లో వివిధ రకాల రాయితీలను కూడా కల్పిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే.. ప్రధాన ఎయిర్ లైన్స్ లో ఒకటైనా విస్తారా సంస్థ..ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో వైఫై సేవలు అందించిన తొలి సంస్థగా రికార్డులోకి ఎక్కింది. ఇక పూర్త వివరాల్లోకి వెళ్తే….
విస్తారా ఎయిర్ లైన్స్ లో ప్రయాణించే వారికి ఓ బంపర్ ఆఫర్ లభించింది. ఇక నుంచి విమానంలో 20 నిమిషాల పాటు ఉచితంగా వైఫై ను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల కాంప్లిమెంటరీ వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చని టాటా- సింగపూర్ ఎయిర్ లైన్సన్ ఉమ్మడిగా దీనిని తీసుకొచ్చాయి. ప్రస్తుతం బోయింగ్ 787-9, ఎయిర్ బస్ ఏ321 నియో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా నిర్వహించనున్నారు. ఇక కాంప్లిమెంటరీ 20 నిమిషాల వైఫై యాక్సెస్ ను అన్ని అన్ని తరగతుల్లోని ప్రయాణీకులకు కనెక్ట్ అయ్యే విధంగా వీలు కల్పిస్తుంది. భారత క్రెడిట్, డెబిట్ కార్డ్ లను వినియోగించి.. ఈ వైఫై ప్లాన్ లను కొనుగోలు చేయాలనుకునే వారి కూడా ఈ అనువైనదని విస్తారా సంస్థ తెలిపింది. ఇక ఈ ఆఫర్ గురించి ఆయన విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రాజావత్ కీలక విషయాలను తెలిపారు.
కాంప్లిమెటరీ వైఫై ను అంతర్జాతీయ విమానాల్లోని అన్ని తరగతులకు అందించిన తొలి సంస్థ గా విస్తారా రికార్డుకెక్కిందని ఆయన తెలిపారు. వినియోగదారులకు మరింత సౌకర్యమైన, సుఖవంతమైన ప్రయాణం అందిచడమే లక్ష్యంగా ఈ సేవలను అందిస్తున్నట్లు రంజన్ తెలిపారు. టాటా గ్రూప్ కి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన విస్తారా.. ఇలా విమాన ప్రయాణికులకు తరచూ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. గతంలోనూ విహార యాత్రలకు వెళ్లే వారి కోసం ‘విస్తారా మాన్సూన్ సేల్’ పేరుతో ప్రత్యేకంగా ఒక సేల్ ను విస్తారా ప్రారంభించింది. తాజాగా ఇలా 20 నిమిషాల పాటు అంతర్జాతీయ విమానాల్లో వైఫై అందిస్తూ మరో ఆఫర్ ను ప్రయాణికులకు కల్పిచింది.