iDreamPost
android-app
ios-app

పుట్టబోయే బిడ్డ కోసం దీపికా షాకింగ్ నిర్ణయం.. ఎంటో తెలుసా?

  • Published Jul 27, 2024 | 11:40 AM Updated Updated Jul 27, 2024 | 11:40 AM

Deepika Padukone: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొంతమంది నటీమణులు త్వరలో మాతృత్వపు ఆనందాన్ని పొందబోతున్నామని బేబీ బంప్ ఫోటోలు ఫ్యాన్స్ కి షేర్ చేస్తున్నారు.

Deepika Padukone: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొంతమంది నటీమణులు త్వరలో మాతృత్వపు ఆనందాన్ని పొందబోతున్నామని బేబీ బంప్ ఫోటోలు ఫ్యాన్స్ కి షేర్ చేస్తున్నారు.

  • Published Jul 27, 2024 | 11:40 AMUpdated Jul 27, 2024 | 11:40 AM
పుట్టబోయే బిడ్డ కోసం దీపికా షాకింగ్ నిర్ణయం.. ఎంటో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా.. మోడల్ గా కెరీర్ ప్రారంబించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె కూతురు దీపికా పదుకొణె. 2007 లో షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి 2006లో ‘ఐశ్వర్య’ అనే కన్నడ మూవీలో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఓం శాంతి ఓం బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత బాలీవుడ్ వరుస ఛాన్సులతో దూసుకు పోయింది. సహనటుడు రణవీర్ సింగ్ భవ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీపికా పదుకొని ప్రెగ్నెన్సీ.. ఆమె తనకు పుట్టబోయే బిడ్డ గురించి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్స్‌లో ఒకరు దీపికా పదుకొణె. తన అందం.. అభినయంతో కోట్ల మంది ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ఈ మద్యనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ లో నటిస్తున్న దీపికా త్వరలో తల్లికాబోతుంది. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు తల్లి కాబోతున్న ఆనందాన్ని ఆస్వాధిస్తుంది. ప్రస్తుతం దీపికా రెస్ట్ తీసుకుంటుంది.  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దీపికా తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తు ఉంటుంది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా తనకు పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎక్కువ సమయం తన బేబీతోనే గడపాడని నిర్ణయం తీసుకుందట. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు పిల్లలను ఎక్కువగా కేర్ టేకర్స్‌కి అప్పగిస్తున్నారు. కానీ తాను అలా చేయనని.. తన బిడ్డ అలనా పాలనా మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇందుకోసం తన భర్త రణవీర్ సింగ్ ని కూడా భాగస్వామ్యం అయ్యేలా చేస్తుందట. తల్లిదండ్రుల పరిరక్షణలో బిడ్డ ఎదుగుదల ప్రేమానురాగాలు వెల్లువిరుస్తాయానే నమ్మకం దీపికాకు ఉండటం చేతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టకుండా తనే చూసుకుంటానంటున్న దీపికాను చూసి మిగతా సెలబ్రెటీలు ఆమెను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీ కారణంగా వెబ్ సీరీస్ ‘ది వైట్ లోటస్’ మూడో సీజన్ ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio