iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ట్రూ ఫ్రెండ్ అనుకున్న తేజ.. పదే పదే అవమానిస్తున్న శోభా!

Bigg Boss 7 Telugu: ట్రూ ఫ్రెండ్ అనుకున్న తేజ.. పదే పదే అవమానిస్తున్న శోభా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో లవ్ ట్రాకులు లేవని చాలామంది అభిమానులు హర్ట్ అయిపోతున్నారు. అయితే ఈ సీజన్ లో లవ్ ట్రాకులు లేకపోవడానికి ప్రిన్స్ యావర్ కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రిన్స్ యావర్ ఎవరితో అయితే క్లోజ్ అవుతాడో ఆ అమ్మాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతోంది. మొదట రతిక అన్నాడు ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత శుభశ్రీ అన్నాడు ఆమె కూడా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత కొత్తగా నయని అన్నాడు.. ఆమె పాపం మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో లవ్ ట్రాక్ లేకపోయినా ఫ్రెండ్ షిప్ ట్రాకులు మాత్రం చాలానే ఉన్నాయి. వారిలో ముఖ్యంగా తేజ- శోభా బాండింగ్ అందరికీ బాగా నచ్చింది.

హౌస్ లో టేస్టీ తేజాతో శోభా శెట్టి బాగా కలిసిపోయింది. తేజ తనకు అన్నం తినిపించినప్పటి నుంచి తేజాతో శోభా బాగా కనెక్ట్ అయ్యింది. తేజా నాకు ఇంటి సభ్యుడిగా అయ్యాడు అని చెప్పింది. ఆ తర్వాత వాళ్లిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. టాస్కుల్లో కలిసే ఆడటం, శోభాని గెలిపించడం కోసం టేస్టీ తేజ లాబీయింగ్ చేయడం కూడా చూశాం. అయితే తేజ మొదటి నుంచి ఒకేలా ఉన్నాడు. కానీ, శోభా శెట్టి మాత్రం రాను రాను మారుతూ కనిపిస్తోంది. హౌస్ మేట్ అయిన తర్వాత శోభా ప్రవర్తన చాలా మారింది అంటూ ప్రేక్షకులు కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా హౌస్ మేట్ అయ్యాక శోభాశెట్టి స్కూల్ ప్రిన్సిపాల్ లా మారిపోయింది.

హౌస్ మేట్ కాన్సెప్ట్ పోయాక.. అందరూ ఒకటే అన్నారు. అప్పటి నుంచి టాస్కుల్లో ఆట తగ్గించి అరవడం పెంచేసింది. అయితే ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా కూడా టేస్టీ తేజ మాత్రం మొదటి నుంచి ఫ్రెండ్ గానే ఉన్నాడు. కానీ, శోభా మాత్రం తేజాని సందర్భాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడటం, కించ పరచడం చేస్తూ వస్తోంది. శోభా లైన్ క్రాస్ అవుతోంది అనిపించి తేజ అలా చేయకు అని చెబితే.. నాకు బుద్ధులు చెప్పే ముందు నీలో ఉన్న మంచి చెడు గురించి ఆలోచించుకో అంటూ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడే కాకుండా చాలా సందర్భాల్లో తేజాని తప్పుగానే అర్థం చేసుకుంది. అర్జున్ పనిష్మెంట్ కోసం తేజాని షర్ట్ అడిగితే.. తేజాని కావాలని షర్ట్ ఇచ్చాడు అని అనుకుంది.

అవన్నీ దాటి ఈవారం నామినేట్ చేసే వరకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అంతా ఇండివిడ్యూవల్ గానే ఆడాలి. నామినేట్ చేయడం తప్పు కాదు.. కానీ, సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేయడం తప్పు. పైగా ఆమె చెప్పిన రీజన్ వల్ల హౌస్ లో ఆమె ఆటకే కాదు.. ఎవరి ఆటకు ఎలాంటి ఇబ్బంది కలగదు. పనిష్మెంట్ ని సీరియస్ గా తీసుకోవడం లేదు అంటూ తేజాని నామినేట్ చేసింది. తేజా బాధ పడుతున్నాడు అని తెలిసి.. ప్రియాంక నామినేట్ చేయలేదా అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే తేజా మాత్రం శోభాశెట్టి నామినేట్ చేసినందుకు ఎంతో బాధ పడ్డాడు.

హౌస్ లో ఉన్న 12 మంది నన్ను నామినేట్ చేయడం వేరు.. నువ్వు చేయడం వేరు అంటూ చెప్పాడు. 12 మంది వచ్చి కుండ పెట్టి పగలగొట్టినా నేను ఏం పట్టించుకోను. కానీ, నువ్వు నన్ను నామినేట్ చేయడం నేను తీసుకోలేకపోతున్నాను అంటూ టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. నిజానికి శోభాశెట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. తేజ ఆమె ఆటను మెరుగు చేయాలి అనుకుంటున్నాడు. ఒక ఫ్రెండ్ గా ఆమెకు సపోర్ట్ గా ఉంటున్నాడు. కానీ, శోభా శెట్టి మాత్రం పదే పదే తేజాని హర్ట్ చేయడమే పనిగా పెట్టుకుంది. మరి.. శోభా శెట్టి- టేస్టీ తేజాని నామినేట్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి