iDreamPost

సినీ నిర్మాత అరెస్ట్.. తన ఆఫీసులో పనిచేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి

ఎంతో మంది అమ్మాయిలకు ఇండస్ట్రీలోకి రావాలన్నది కల. కానీ ఈ రంగం మహిళలకు అంత సేఫ్ కాదన్న అపవాదు ఉంది. నటన పరంగానే కాదు.. అక్కడ వర్క్ చేసే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని అంటుంటారు. కొంత మంది వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది.

ఎంతో మంది అమ్మాయిలకు ఇండస్ట్రీలోకి రావాలన్నది కల. కానీ ఈ రంగం మహిళలకు అంత సేఫ్ కాదన్న అపవాదు ఉంది. నటన పరంగానే కాదు.. అక్కడ వర్క్ చేసే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని అంటుంటారు. కొంత మంది వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది.

సినీ నిర్మాత అరెస్ట్.. తన ఆఫీసులో పనిచేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి

ఫిల్మ్ ఇండస్ట్రీపై ఇప్పటికే ఓ అపోహ ఉంది. అదే ఆడవాళ్లకు సినీ పరిశ్రమ సురక్షితం కాదని. అందుకే ఇందులోకి వస్తామని అమ్మాయిలు చెప్పగానే.. తల్లిదండ్రులు వెంటనే నో అని చెబుతారు. కమిట్‌మెంట్స్ అడుగుతారని, రూమ్స్‌కు రమ్మని పిలుస్తారని, అమ్మాయిలను ట్యాప్ చేస్తారని, తమకు లొంగని వారిని కెరీర్ లేకుండా చేస్తారని, అవసరమైతే అత్యాచారం చేయడానికి కూడా వెనకాడరని ఎప్పటి నుండో రూమర్స్ ఉన్నాయి. కొంత మంది భంగపడ్డ నటీమణులు, టెక్నీషియన్లు చేసే ఆరోపణలు కూడా ఈ వాదనకు ఆజ్యం పోసేలా మారాయి. అలాగే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలు ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఉండనే ఉన్నాయి.  ఓ ఒక్కరి వల్లో ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది.

ఇప్పుడో నిర్మాత.. తన వద్ద పనిచేసిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఇప్పటి వరకు కిమ్మనకుండా ఉంది. ఇప్పుడు అతడి ఆగడాలు మరింత ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కోలీవుడ్ సినీ నిర్మాత మహ్మద్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ అలీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నిర్మాత. చిన్న నిర్మాతగా  కాస్తంత గుర్తింపు వస్తున్న సమయంలో ఇప్పుడ సెక్స్ హెరాస్ మెంట్ ఆరోపణలపై అరెస్టు కాబడ్డాడు.  కొరట్టూరుకు చెందిన 28 ఏళ్ల యువతి.. గత ఏడాది సెప్టెంబర్‌లో అతడి కార్యాలయంలో ఉద్యోగంలో చేరింది. అయితే అతడికి అప్పటికే పెళ్లి కాగా, ఈ విషయాన్ని దాచి పెట్టి.. ఆ అమ్మాయితో ప్రేమ నటించాడు.

నిన్ను పెళ్లి  చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు.  అనంతరం తనకు బలవంతంగా మద్యం సేవించి అత్యాచారం చేసి.. వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ వీడియో చూపించి.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తాను గర్భవతి కాగా, తనకు అబార్షన్ మాత్రలు ఇచ్చాడని పేర్కొంది బాధితురాలు. ఈ విషయంపై ప్రశ్నిస్తే.. తన వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేస్తానని బెదిరించాడని, తనను బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది సదరు మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేసి.. జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఇలాంటి నిర్మాతలు, దర్శకుల వల్లే.. పరిశ్రమలోకి రావాలంటే భయపడుతున్నారు కొంత మంది అమ్మాయిలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి