iDreamPost

సాయి తేజ్ సినిమాకున్న సవాళ్లేంటి

సాయి తేజ్ సినిమాకున్న సవాళ్లేంటి

ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు పరిణామాల వల్ల అసలు సినిమా కంటే రాజకీయ అంశాలు హై లైట్ కావడంతో రిపబ్లిక్ కు హైప్ పరంగా దక్కాల్సిన ప్రయోజనం మిస్ అయ్యిందనే చెప్పాలి. అక్టోబర్ 1న చెప్పుకోదగ్గ పోటీ లేకపోయినా ఈ సినిమాకంటూ కొన్ని రిస్కులు లేకపోలేదు. మొదటిది ఒకరోజు ముందు 30న వస్తున్న జేమ్స్ బాండ్ కొత్త మూవీ ‘నో టైం టు డై’కు భారీ క్రేజ్ ఉండటం. ఇప్పటిదాకా వచ్చిన బాండ్ సినిమాల్లో అత్యధిక నిడివి(2 గంటల 45 నిముషాలు)తో వస్తున్న ఈ సినిమా బుకింగ్స్ పది రోజుల ముందే మొదలుపెట్టేశారు. ఏ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. టాక్ బాగుంటే ఇక రచ్చ రచ్చే.

రిపబ్లిక్ తో పాటు శ్రీకాంత్ సుమంత్ అశ్విన్ నటించిన ఇది మా కథ, అసలేం జరిగిందంటే అనే మరో రెండు సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. సాయి తేజ్ ఇమేజ్ తో పోటీ పడే సీన్ వీటికి లేదు కానీ ఆయా నిర్మాతలైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. మరోపక్క లవ్ స్టోరీ ఇంకా జోరుగానే సాగుతోంది. వచ్చే వీకెండ్ ఫ్యామిలీని తో తనవైపు లాక్కుంటుందనే అంచనాలు ట్రేడ్ లో గట్టిగా ఉన్నాయి. రిపబ్లిక్ సీరియస్ సబెక్టు కనక కామన్ ఆడియన్స్ ని టర్న్ చేయాలంటే అందులో చాలా మ్యాటర్ ఉండాలి. దేవా కట్టా సత్తా ఉన్న దర్శకుడే అయినా ప్రస్థానం స్థాయి మేజిక్ సాధ్యమైతేనే మరోసారి సక్సెస్ అందుకోవచ్చు.

రమ్యకృష్ణ, జగపతిబాబు, ఐశ్వర్య రాజేష్ ఇలా క్యాస్టింగ్ పరంగా పర్ఫెక్ట్ సెటప్ ఉన్న రిపబ్లిక్ కి హీరో సాయి తేజ్ యాక్సిడెంట్ వల్ల ప్రమోషన్లకు అందుబాటులో లేకపోవడం కొంత దెబ్బ తీస్తోంది. సానుభూతి మీద మెగా ఫ్యాన్స్ మొదటిరోజు వెల్లువెత్తినా ఆ తర్వాత కొనసాగాలంటే మాత్రం టాక్ అండ్ రివ్యూస్ చాలా కీలకం. యావరేజ్ ఉన్నా చాలు నిర్మాతలు గట్టెక్కొచ్చని సెకండ్ లాక్ డౌన్ అయ్యాక కొన్ని సినిమాలు ఇప్పటికే ఋజువు చేశాయి. సో ఆ మాట ఒకటి బయటికి వస్తే చాలు. మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు. మొన్న ఈవెంట్ లో సాయి తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదనేలా పవన్ చెప్పిన మాటలు అభిమానుల ఆందోళనను మళ్ళీ రేపాయి

Also Read : మైక్ టైసన్ మొదటి సినిమా ఏది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి